భారత్‌తో తొలి వన్డే: టాస్ నెగ్గిన ఇంగ్లండ్
ABN , Publish Date - Jul 14 , 2026 | 03:16 PM
బర్మింగ్‌హామ్ వేదికగా ఇంగ్లండ్-భారత్ జట్లు తొలి వన్డేలో తలపడనున్నాయి. ఈ క్రమంలో టాస్ నెగ్గిన ఇంగ్లండ్.. బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో టీమిండియా తొలుత ఫీల్డింగ్ చేయనుంది.
ఇంటర్నెట్ డెస్క్: బర్మింగ్‌హామ్ వేదికగా ఇంగ్లండ్-భారత్ జట్లు తొలి వన్డేలో తలపడనున్నాయి. ఈ క్రమంలో టాస్ నెగ్గిన ఇంగ్లండ్.. బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో టీమిండియా తొలుత ఫీల్డింగ్ చేయనుంది. స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తిరిగి జట్టులోకి వచ్చారు. టీ20 సిరీస్ కోల్పోయిన భారత్.. ఈ వన్డే సిరీస్‌తో ఇంగ్లండ్‌పై రివేంజ్ తీర్చుకోవాలని చూస్తోంది. ఐపీఎల్ తర్వాత ఫిట్‌నెస్ సమస్యలు ఎదుర్కొన్న రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్‌లో రాణిస్తారా? అనేది చూడాల్సి ఉంది.
ఇంగ్లండ్ తుది జట్టు:
హ్యారీ బ్రూక్(కెప్టెన్), జాకబ్ బెథెల్, బెన్ డకెట్, జో రూట్, జోస్ బట్లర్(వికెట్ కీపర్), శామ్ కరన్, విల్ జాక్స్, జోఫ్రా ఆర్చర్, లియామ్ డాసన్, జోష్ టంగ్, ఆదిల్ రషీద్
భారత తుది జట్టు:
శుభ్‌మన్ గిల్(కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, శివమ్ దూబె, అక్షర్ పటేల్, గుర్నూర్ బ్రార్, బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ
ఇవి కూడా చదవండి:
బిగ్‌బాష్ లీగ్ షెడ్యూల్ విడుదల.. చెన్నైలో తొలి మ్యాచ్..
వన్డే ప్రపంచ కప్ 2027.. రో-కో అనుభవం జట్టుకు అవసరం: గిల్