జపాన్ ఓపెన్ టోర్నీ: పీవీ సింధు శుభారంభం
ABN , Publish Date - Jul 14 , 2026 | 05:10 PM
భారత స్టార్ షట్లర్ పీవీ సింధు జపాన్ ఓపెన్ సూపర్-750 బ్యాడ్మింటన్ టోర్నీలో శుభారంభం చేసింది. మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో మలేషియాకు చెందిన వాంగ్ లింగ్ చింగ్‌పై వరుస గేమ్‌ల్లో విజయం సాధించి రెండో రౌండ్‌కు అర్హత సాధించింది.
ఇంటర్నెట్ డెస్క్: భారత స్టార్ షట్లర్, రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు జపాన్ ఓపెన్ సూపర్-750 బ్యాడ్మింటన్ టోర్నీలో శుభారంభం చేసింది. మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో మలేషియాకు చెందిన వాంగ్ లింగ్ చింగ్‌పై వరుస గేమ్‌ల్లో విజయం సాధించి రెండో రౌండ్‌కు అర్హత సాధించింది. ప్రపంచ 10వ ర్యాంకర్, మాజీ ప్రపంచ ఛాంపియన్ సింధు.. ప్రపంచ 37వ ర్యాంకర్ వాంగ్‌ను 21-14, 21-11 తేడాతో అలవోకగా ఓడించింది. ఆరంభం నుంచే మ్యాచ్‌పై పూర్తి ఆధిపత్యం చెలాయించిన సింధు.. ప్రత్యర్థికి ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా కేవలం రెండు గేమ్‌ల్లోనే పోరును ముగించింది.
మొదటి గేమ్‌లో 7-4 ఆధిక్యం సాధించిన సింధు.. నెట్ డ్రాప్‌లు, హాఫ్ స్మాష్‌లు, కచ్చితమైన షాట్లతో ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచింది. వాంగ్ చేసిన వరుస తప్పిదాలను సద్వినియోగం చేసుకుంటూ తొలి గేమ్‌ను 21-14తో కైవసం చేసుకుంది. రెండో గేమ్‌లో మరింత దూకుడుగా ఆడిన సింధు.. 8-2, ఆపై 11-3తో భారీ ఆధిక్యం సాధించింది. ఆ తర్వాత కూడా అదే జోరు కొనసాగిస్తూ 16-5తో ముందంజలో నిలిచింది. చివరికి వాంగ్ మరోసారి తప్పిదం చేయడంతో 21-11తో గేమ్‌ను ముగించి రెండో రౌండ్‌లోకి అడుగుపెట్టింది.
మిక్స్‌డ్ డబుల్స్‌లో కూడా..
మిక్స్‌డ్ డబుల్స్‌లో భారత జోడీ ధ్రువ్ కపిలా–తనిషా క్రాస్టో కూడా విజయం సాధించి రెండో రౌండ్‌కు అర్హత సాధించింది. స్కాట్లాండ్‌కు చెందిన అలెగ్జాండర్ డన్–జూలీ మాక్‌ఫర్సన్ జోడీని 21-16, 21-14తో ఓడించింది. అయితే మరో భారత జోడీ రోహన్ కపూర్–రుత్విక శివానీ గడ్డే మాత్రం ఓటమిని చూసింది. తొలి రౌండ్‌లోనే టోర్నీ నుంచి నిష్క్రమించింది. టాప్ సీడ్ చైనా జోడీ ఫెంగ్ యాన్ జే–హువాంగ్ డాంగ్ పింగ్ చేతిలో 11-21, 10-21 తేడాతో ఓడిపోయింది.
ఇవి కూడా చదవండి:
ఇంగ్లండ్‌పై వన్డేల్లో అత్యధిక పరుగులు.. అరుదైన రికార్డుపై కన్నేసిన కోహ్లీ
ఇంగ్లండ్‌తో సెమీస్‌కు ప్రత్యేక జెర్సీ.. ఫిఫాకు అర్జెంటీనా అభ్యర్థన