Share News

గంభీర్-కోహ్లీ మధ్య కోల్డ్ వార్? ప్రాక్టీస్ సెషన్ వీడియోలు వైరల్

ABN , Publish Date - Jul 14 , 2026 | 04:14 PM

భారత ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మధ్య మళ్లీ విభేదాలు తలెత్తాయా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇంగ్లండ్‌తో తొలి వన్డే మ్యాచ్‌కు ముందు ప్రాక్టీస్ సెషన్‌లో వీరిద్దరూ మాట్లాడుకోకపోవడం చర్చనీయాంశం అయింది.

గంభీర్-కోహ్లీ మధ్య కోల్డ్ వార్? ప్రాక్టీస్ సెషన్ వీడియోలు వైరల్
Gautam Gambhir, Virat Kohli

ఇంటర్నెట్ డెస్క్: భారత ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మధ్య మళ్లీ విభేదాలు తలెత్తాయా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇంగ్లండ్‌తో టీమిండియా మూడు వన్డేల సిరీస్ ఆడుతోంది. తొలి వన్డే మ్యాచ్‌కు ముందు ప్రాక్టీస్ సెషన్‌లో వీరిద్దరూ మాట్లాడుకోకపోవడం చర్చనీయాంశం అయింది. నెట్స్‌లో గంభీర్ ఇతర ప్లేయర్లతో మాట్లాడినప్పటికీ.. కోహ్లీతో మాత్రం ఒక్కసారి కూడా మాట్లాడలేదని వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన ప్రాక్టీస్ సెషన్ వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


గంభీర్ ఎక్కువ సమయం కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌తో పాటు రోహిత్ శర్మ, బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్, ఇతర సహాయక సిబ్బందితోనే చర్చలు జరిపారు. అయితే మొత్తం ప్రాక్టీస్ సెషన్‌లో కోహ్లీతో గంభీర్ ప్రత్యక్షంగా మాట్లాడిన దాఖలాలు కనిపించలేదని వార్తలు వస్తున్నాయి. అదే సమయంలో విరాట్ కోహ్లీ తన బ్యాటింగ్ ప్రాక్టీస్‌ను సితాన్షు కోటక్ పర్యవేక్షణలో పూర్తి చేశాడు. ప్రాక్టీస్ తర్వాత కోటక్‌తో కోహ్లీ సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తోంది.


గతంలో ఐపీఎల్ సందర్భంగా గంభీర్, కోహ్లీ మధ్య వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. గంభీర్ టీమిండియా హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రొఫెషనల్ ప్లేయర్లలా కలిసే పని చేశారు. మళ్లీ ఇప్పుడు ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కు ముందు వీరిద్దరూ మాట్లాడుకోవడం లేదంటూ వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే టీ20ల్లో క్లీన్ స్వీప్ అయిన టీమిండియా.. వన్డేలో గెలవాలని ఆశిస్తోంది. ఇలాంటి సమయంలో కోహ్లీ, గంభీర్ మధ్య విభేదాలు మ్యాచ్ ఫలితాలపై ప్రభావం చూపుతాయా? అంటూ అభిమానులు గందరగోళానికి గురవుతున్నారు.


ఇవి కూడా చదవండి:

ఇంగ్లండ్‌పై వన్డేల్లో అత్యధిక పరుగులు.. అరుదైన రికార్డుపై కన్నేసిన కోహ్లీ

ఇంగ్లండ్‌తో సెమీస్‌కు ప్రత్యేక జెర్సీ.. ఫిఫాకు అర్జెంటీనా అభ్యర్థన

Updated Date - Jul 14 , 2026 | 04:14 PM