-
-
Home » Mukhyaamshalu » ABN AndhraJyothy Ap and Telangana National and International Breaking Live Updates of 28th April 2026 BSB
-
ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్
ABN , First Publish Date - Apr 28 , 2026 | 06:18 AM
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.
Live News & Updates
-
Apr 28, 2026 07:42 IST
బంగ్లాదేశ్‌లో భారత హైకమిషనర్‌గా దినేశ్ త్రివేది
త్వరలో బాధ్యతలు చేపట్టనున్న దినేశ్ త్రివేది
-
Apr 28, 2026 07:33 IST
మార్కాపురం: కంభం సమీపంలో రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి
జంగంగుంట్ల వద్ద బైక్‌ను ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు
ఒకరి మృతి, మరొకరికి గాయాలు
-
Apr 28, 2026 07:14 IST
విశాఖ: కాసేపట్లో గూగుల్ ఏఐ డేటా సెంటర్‌కు భూమిపూజ
గూగుల్ డేటా సెంటర్‌ను ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు
విశాఖ జిల్లాలో 3 ఏరియాల్లో డేటా సెంటర్‌కు భూ కేటాయింపులు
తర్లువాడ, రాంబిల్లి, అడవివరంలో 600 ఎకరాల భూ కేటాయింపు
15 బిలియన్ డాలర్ల పెట్టుబడి, 1 గిగావాట్ సామర్థ్యంతో డేటా సెంటర్
ఇప్పటికే విశాఖలో సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్
-
Apr 28, 2026 07:02 IST
తిరుపతి: వాహనదారులకు రవాణా శాఖ పన్ను ఆఫర్
వాహనాల త్రైమాసిక పన్ను అపరాధ రుసుం లేకుండా చెల్లించేందుకు ఈ నెలాఖరు వరకు గడువు
పన్నులు చెల్లించనివారి వాహనాలు తనిఖీల్లో పట్టుబడితే మే నుంచి 100 శాతం పెనాల్టీ
జూన్ నుంచి చెల్లించేవారికి 200 శాతం పెనాల్టీ
-
Apr 28, 2026 06:57 IST
సూడాన్‌లో విమానం కూలడంతో 14 మంది మృతి
-
Apr 28, 2026 06:56 IST
లద్దాఖ్‌లో 5 కొత్త జిల్లాల ఏర్పాటుకు ఆమోదం
కేంద్ర నోటిఫికేషన్‌కు లెఫ్టినెంట్ గవర్నర్ ఆమోదం
లెహ్, కార్గిల్‌తో కలిపి ఏడుకు పెరగనున్న జిల్లాలు
-
Apr 28, 2026 06:56 IST
అనంతపురం హనీట్రాప్ కేసులో వైసీపీ నేత నరేంద్రరెడ్డికి రిమాండ్
నిందితురాలు రంగమ్మతో కలిసి బాధితులను బెదిరించినట్లు ఆరోపణలు
నిందితులకు రిమాండ్ విధించిన అనంతపురం జిల్లా కోర్టు
-
Apr 28, 2026 06:55 IST
కృష్ణా జిల్లా: ఉయ్యూరులో ప్రైవేట్ బస్సు ప్రమాదంలో ఒకరి మృతి
బస్సులో ప్రయాణిస్తున్న 15 మందికి గాయాలు, ఆసుపత్రికి తరలింపు
మృతుడు పోలవరం మండలం పాలరేవుకు చెందిన గణేశ్‌గా గుర్తింపు
-
Apr 28, 2026 06:48 IST
IPL 2026: నేడు పంజాబ్ Vs రాజస్థాన్ మ్యాచ్
రాత్రి 7:30కు చండీగఢ్‌లో పీబీకేఎస్, ఆర్ఆర్ మధ్య పోరు
-
Apr 28, 2026 06:41 IST
విజయనగరం: పూసపాటిరేగ NHపై కారు బీభత్సం.. నలుగురి మృతి
విశాఖ నుంచి శ్రీకాకుళం వెళుతున్న కారు
పేరాపురం వద్ద రోడ్డు దాటుతున్న ఇద్దరిని ఢీకొన్న కారు
అనంతరం లారీని ఢీకొట్టిన ఘటనలో కారు డ్రైవర్ సహా మరొకరి మృతి
మృతదేహాలు విజయనగరం ఆసుపత్రికి తరలింపు
-
Apr 28, 2026 06:27 IST
తిరుమల శ్రీవారి సేవలో ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్న ఉపరాష్ట్రపతి
-
Apr 28, 2026 06:27 IST
బెంగాల్‌లో రెండో విడత ఎన్నికలకు కౌంట్‌డౌన్
రేపు బెంగాల్‌లో 142 స్థానాలకు పోలింగ్
మే 4న ఎన్నికల ఫలితాలు
-
Apr 28, 2026 06:25 IST
రెండోరోజు విశాఖలో సీఎం చంద్రబాబు పర్యటన
మ.2:00 గంటలకు సింహాచలానికి సీఎం చంద్రబాబు
సింహాచలం స్వామివారి దర్శనం చేసుకోనున్న సీఎం
మ.2:40 గంటలకు సౌత్‌కోస్ట్ రైల్వేజోన్ తాత్కాలిక కార్యాలయం సందర్శన
-
Apr 28, 2026 06:22 IST
నేడు విశాఖలో గూగుల్ డేటా సెంటర్‌కు శంకుస్థాపన
రూ.1.35 లక్షల కోట్ల పెట్టుబడితో 601 ఎకరాల విస్తీర్ణంలో గూగుల్ డేటా సెంటర్ నిర్మాణం
పాల్గొననున్న సీఎం చంద్రబాబు, మంత్రులు
హాజరుకానున్న గూగుల్ క్లౌడ్ సీఈవో థామస్ కురియన్, సంస్థ ప్రతినిధులు