Share News

ఆ అవార్డు నాకు ప్రత్యేకం!

ABN , Publish Date - Oct 25 , 2026 | 07:57 AM

ఒకట్రెండు తెలుగు సినిమాలతో పరిచయమైన ప్రీతి ముకుందన్‌... ‘బ్లాస్ట్‌’, ‘హృదయం మురళి’ అనే అనువాద చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది.

ఆ అవార్డు నాకు ప్రత్యేకం!
Preity Mukhundhan

ఒకట్రెండు తెలుగు సినిమాలతో పరిచయమైన ప్రీతి ముకుందన్‌... ‘బ్లాస్ట్‌’, ‘హృదయం మురళి’ అనే అనువాద చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. తాజాగా ‘ఏమో ఏమో ఇది’ అంటూ రోషన్‌తో జత కట్టింది. ఈ సందర్భంగా ఆమె చెబుతున్న కొన్ని కబుర్లివి...

కథను మాత్రమే చూస్తా...

కేవలం నటనకే పరిమితం కావాలనుకోవట్లేదు. నాలో ఓ రచయిత్రి కూడా ఉంది. ఏదైనా సినిమా చూస్తున్నప్పుడు నటీనటులను, వారి నటనను చూడను. కథకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తా. సైన్స్‌ ఫిక్షన్‌ కథనాలంటే ఇష్టం. సామాన్యులకు అర్థమయ్యే భావోద్వేగాలతో కూడిన కథలు చేయాలనుకుంటున్నా.


book1.2.jpgమర్చిపోలేని అనుభూతి

ఈ ఏడాది ఐఎమ్‌డీబీ (ఇంటర్నెట్‌ మూవీ డాటా బేస్‌) నుంచి ‘బ్రేకవుట్‌ స్టార్‌’ అవార్డు అందుకోవడం మర్చిపోలేని ప్రత్యేక అనుభూతి. నేను చేసే పాత్రలు ప్రభావశీలంగా ఉండాలని కోరుకుంటా. అయితే నా జర్నీ ఇప్పుడే మొదలైంది. నేనింకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది.

అర్థం చేసుకోవడం ముఖ్యం

ఒక రిలేషన్‌షిప్‌లో అన్నింటికన్నా ఎక్కువగా సహానుభూతి అనే క్వాలిటీని గౌరవించాలి. ఎదుటివారి భావాలను అర్థం చేసుకునే వాళ్లంటే ఇష్టం. నాకు కాబోయే లైఫ్‌ పార్టనర్‌ కూడా నా ఎమోషన్స్‌, ఆలోచనలను గౌరవించే వాడై ఉండాలి. ఒకరినొకరు అర్థం చేసుకునే గుణం ఉంటేనే ఆ బంధం బలంగా ఉంటుందని నమ్ముతా.


నా బ్యాడ్‌లక్‌...

ఇప్పటిదాకా తెలుగు, తమిళ, మలయాళ సినిమాల్లో కనిపించా. త్వరలో బాలీవుడ్‌లోనూ అడుగుపెడుతున్నా. బిజీగా ఉన్నప్పుడే అల్లు అర్జున్‌, అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మెగా ప్రాజెక్ట్‌ ‘రాకా’లో నటించే గోల్డెన్‌ ఛాన్స్‌ వచ్చింది. అందులో కీలకపాత్ర కోసం నన్ను సంప్రదించారు. దురదృష్టవశాత్తు డేట్స్‌ కుదరకపోవడం వల్ల... అంత మంచి అవకాశాన్ని వదులుకోవాల్సి వచ్చింది.


book1.3.jpgమ్యూజిక్‌ ఆల్బమ్స్‌లో...

ఎన్‌ఐటీలో ఎలకా్ట్రనిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్‌ పూర్తి చేశా. ఐదేళ్ల వయసు నుంచే భరతనాట్యం నేర్చుకున్నా. హిప్‌-హాప్‌, వెస్ట్రన్‌ డ్యాన్స్‌ కూడా వచ్చు. డ్యాన్స్‌ మీద ఉన్న ఆసక్తితోనే రెండు మ్యూజిక్‌ ఆల్బమ్స్‌లో కనిపించా. నేను ఫుడీని. ఫాస్ట్‌ఫుడ్‌ ఇష్టంగా తింటా. బిర్యానీ ఉంటే పండగే.

ఆయన మనవరాలినే...

మా అమ్మ డెంటిస్ట్‌, నాన్న వ్యాపారవేత్త. నేను ప్రఖ్యాత గణిత మేధావి శ్రీనివాస రామానుజన్‌గారి మనవరాలినంటూ వార్తలు వచ్చాయి. అందులో కొంత నిజం లేకపోలేదు. నేను ఆయనకి డైరెక్ట్‌గా మనవరాలిని కాదు. ఆయన సోదరుడి వైపు నుంచి నాకు బంధుత్వం ఉంది. ఆయన నాకు ముత్తాత అవుతారు. ప్రముఖ గిటార్‌ విద్వాంసుడైన గిటార్‌ ప్రసన్న నా మేనమామ.


ఈ వార్తలు కూడా చదవండి:

బంగాళాఖాతంలో తుఫాన్‌!

ఉపాధి హామీలో ఏఐ వెరిఫికేషన్‌

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 25 , 2026 | 07:57 AM