బాక్సర్ ఆదిత్యకు పతకం ఖాయం
ABN , Publish Date - Oct 25 , 2026 | 07:05 AM
భారత యువ బాక్సర్ ఆదిత్య అండర్-19 ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో సెమీఫైనల్ చేరి పతకం ఖాయం చేసుకున్నాడు...
అండర్-19 ప్రపంచ చాంపియన్‌షిప్
న్యూఢిల్లీ: భారత యువ బాక్సర్ ఆదిత్య అండర్-19 ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో సెమీఫైనల్ చేరి పతకం ఖాయం చేసుకున్నాడు. మాంటెనెగ్రోలోని బుడ్వాలో శనివారం జరిగిన పురుషుల 55 కిలోల విభాగం క్వార్టర్‌ఫైనల్లో ఆదిత్య 5-0తో ఇటలీ బాక్సర్ టొమాసో ఓర్లాండోను చిత్తు చేశాడు. సెమీ్‌సలో ఓడినా ఆదిత్యకు కనీసం కాంస్యం దక్కనుంది. ఫైనల్లో చోటు కోసం నిహత్ గసిమోవ్ (అజర్‌బైజాన్)తో ఆదిత్య తలపడనున్నాడు. ఈ టోర్నీలో ఇప్పటికే ఇద్దరు మహిళా బాక్సర్లు మేఘా షెకాంద్ (80 కిలోలు), ప్రచీ టోకాస్ (75 కి.) సెమీ్‌సలో అడుగుపెట్టి భారత్‌కు పతకాలు ఖరారు చేసిన సంగతి తెలిసిందే.
ఇవి కూడా చదవండి:
ఫ్యామిలీ కోసమే రీఎంట్రీ.. భువీ జెర్సీ నంబర్ వెనుక ఆసక్తికరమైన కథ!
ఫ్రెంచ్ ఓపెన్: ఫైనల్‌కు దూసుకెళ్లిన పీవీ సింధు