‘క్లోరోఫామ్ లీకేజీ’పై హెచ్‌ఆర్సీ సుమోటో కేసు
ABN , Publish Date - Oct 25 , 2026 | 07:11 AM
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డపోతారంలోని సరాకా లేబొరేటరీస్‌లో క్లోరోఫామ్ ఆవిరి లీకైన ఘటనపై తెలంగాణ మానవ హక్కుల కమిషన్ సుమోటోగా విచారణ చేపట్టింది.
హైదరాబాద్, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డపోతారంలోని సరాకా లేబొరేటరీస్‌లో క్లోరోఫామ్ ఆవిరి లీకైన ఘటనపై తెలంగాణ మానవ హక్కుల కమిషన్ సుమోటోగా విచారణ చేపట్టింది. గురువారం రాత్రి జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు కార్మికులు మరణించగా, మరికొందరు అస్వస్థతకు గురై చికిత్స పొందినట్లు శనివారం ఆంధ్రజ్యోతి సహా వివిధ పత్రికల్లో వచ్చిన వార్తలను కమిషన్ పరిగణనలోకి తీసుకుంది. చైర్‌పర్సన్ జస్టిస్ షమీమ్ అక్తర్ నేతృత్వంలో విచారణకు చర్యలు చేపట్టింది. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై నవంబరు 26లోగా నివేదిక సమర్పించాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది.
ఈ వార్తలు కూడా చదవండి:
ఐపీఎస్‌ల సంతకాలు ఫోర్జరీ చేసి.. కోటికి పైగా కొల్లగొట్టి.. జల్సాలకు తగలెట్టి!
హుడా హైట్స్‌లో చ.గజం అప్‌సెట్ ధర 2 లక్షలు
Read Latest AP News And Telangana News And International News And Telugu News