‘ఫ్రెంచ్’ ఫైనల్‌కు సింధు
ABN , Publish Date - Oct 25 , 2026 | 07:08 AM
రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు ఫ్రెంచ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో ఫైనల్‌కు దూసుకెళ్లింది...
ప్రపంచ నెం.1తో టైటిల్‌ఫైట్ నేడు
పారిస్: రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు ఫ్రెంచ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో ఫైనల్‌కు దూసుకెళ్లింది. శనివారం ఇక్కడ జరిగిన సింగిల్స్ సెమీఫైనల్లో సింధు 21-10, 20-22, 21-16తో జపాన్ షట్లర్ హినా అకెచిపై గెలిచింది. ఈ ఏడాది సూపర్ 750 సిరీస్ టోర్నీలో ఫైనల్ చేరడం సింధుకిది రెండోసారి. అంతకుముందు జపాన్ ఓపెన్‌లో ఫైనల్ చేరింది. ఆదివారం జరిగే టైటిల్ పోరులో ప్రపంచ నెంబర్‌వన్ అన్ సే యంగ్ (దక్షిణ కొరియా)తో సింధు తలపడనుంది.
ఇవి కూడా చదవండి:
ఫ్యామిలీ కోసమే రీఎంట్రీ.. భువీ జెర్సీ నంబర్ వెనుక ఆసక్తికరమైన కథ!
ఫ్రెంచ్ ఓపెన్: ఫైనల్‌కు దూసుకెళ్లిన పీవీ సింధు