11 ఏళ్లకే ఇంటర్నేషనల్ మాస్టర్
ABN , Publish Date - Oct 25 , 2026 | 07:15 AM
భారత సంతతికి చెందిన ఇంగ్లిషు బాలిక బోధన శివానందన్ 11 ఏళ్లకే ఇంటర్నేషనల్ మాస్టర్ (ఐఎం) నార్మ్...
38 ఏళ్ల రికార్డును తిరగరాసిన బోధన
లండన్: భారత సంతతికి చెందిన ఇంగ్లిషు బాలిక బోధన శివానందన్ 11 ఏళ్లకే ఇంటర్నేషనల్ మాస్టర్ (ఐఎం) నార్మ్ దక్కించుకుంది. దరిమిలా పిన్న వయస్సులో ఈ ఘనత వహించిన చెస్ ప్లేయర్‌గా రికార్డులకెక్కింది. దాంతో 38 ఏళ్ల కిందట పోలెండ్‌కు చెందిన జూడిత్ పోల్గర్ నెలకొల్పిన రికార్డు కనుమరుగైంది. యూరోపియన్ ఉమెన్స్ చెస్ క్లబ్ కప్ టోర్నీలో 7 రౌండ్లలో 5.5 పాయింట్లు సాధించడం ద్వారా బోధన ఐఎం టైటిల్ సొంతం చేసుకుంది. అంతేకాదు..ఆల్‌టైమ్ 10 మంది పిన్నవయస్సు చెస్ ఆటగాళ్లలో ఒకరిగా ప్రజ్ఞానంద, గుకేష్ తదితరుల సరసన బోధన నిలిచింది.
ఇవి కూడా చదవండి:
ఫ్యామిలీ కోసమే రీఎంట్రీ.. భువీ జెర్సీ నంబర్ వెనుక ఆసక్తికరమైన కథ!
ఫ్రెంచ్ ఓపెన్: ఫైనల్‌కు దూసుకెళ్లిన పీవీ సింధు