ఉపాధి హామీలో ఏఐ వెరిఫికేషన్
ABN , Publish Date - Oct 25 , 2026 | 05:38 AM
గ్రామీణ ఉపాధి హామీ పథకం(వీబీ జీ రామ్‌జీ) పనుల్లో అక్రమాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్‌ను ఏఐ ఆధారిత వెరిఫికేషన్‌గా అప్‌గ్రేడ్ చేయనున్నారు.
కూలీల హాజరు నమోదుకు కొత్త ఫీచర్లు
న్యూఢిల్లీ, అక్టోబరు 24(ఆంధ్రజ్యోతి): గ్రామీణ ఉపాధి హామీ పథకం(వీబీ జీ రామ్‌జీ) పనుల్లో అక్రమాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్‌ను ఏఐ ఆధారిత వెరిఫికేషన్‌గా అప్‌గ్రేడ్ చేయనున్నారు. కూలీల హాజరు నమోదులో అవకతవకలకు అడ్డుకట్ట వేసేందుకు, నిధుల దుర్వినియోగాన్ని అరికట్టేందుకే దీనిని ప్రవేశపెడుతున్నట్లు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ తెలిపారు. వాస్తవానికి ఈ ఏడాది మార్చిలోనే ఉపాధి హామీ పనుల్లో ముఖ నిర్ధారణ(ఫేస్ అథెంటికేషన్)ను ప్రవేశపెట్టినప్పటికీ.. కూలీల నకిలీ హాజరు అలాగే కొనసాగుతున్నట్లు గుర్తించారు. కూలీల ప్రత్యక్ష ముఖానికి బదులుగా వారి ఫొటోను ఫొటో తీయడం లాంటివి చోటుచేసుకుంటున్నట్లు తేలింది. ఈ నేపథ్యంలో ఏఐ ఆధారిత వెరిఫికేషన్‌ను ప్రవేశపెడుతున్నట్లు కేంద్ర మంత్రి చౌహాన్ వెల్లడించారు. బతికి ఉన్న మనిషి కెమెరా ముందుకు వస్తేనే హాజరు నమోదయ్యేలా దీనిని రూపొందించినట్లు తెలిపారు. ఎక్కడైనా నకిలీ హాజరు నమోదు వంటి తప్పులు జరిగినట్లు గుర్తిస్తే.. వాటిని సరి చేసేదాకా ఆ పనికి సంబంధించిన నిధుల బదిలీ(ఎ్‌ఫటీవో) ఆటోమేటిక్‌గా నిలిచిపోతుందన్నారు. అయితే మొబైల్ నెట్‌వర్క్ కనెక్టివిటీ లేని పని ప్రదేశాల్లో మాత్రం ఆఫ్‌లైన్‌లోనే హాజరు నమోదు కొనసాగుతుందని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. వయోవృద్ధులు, దివ్యాంగులు వంటి వారి విషయంలో, సాంకేతిక సమస్య ఎదురైన సందర్భంలో ఏఐ ఆధారిత నమోదు నుంచి మినహాయింపు ఉంటుందన్నారు.
ఇదిలా ఉండగా, డిజిటల్ వ్యవసాయ రంగంలో భారత్ కీలక మైలురాయిని చేరుకుందని శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. నిర్దేశిత గడువు కంటే ముందే దేశవ్యాప్తంగా 11 కోట్ల మంది రైతులకు ప్రత్యేక డిజిటల్ గుర్తింపు కార్డులు(ఫార్మర్ ఐడీ) ఇచ్చినట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం 2027 మార్చి 31 నాటికి 11 కోట్ల ఫార్మర్ ఐడీ కార్డుల లక్ష్యాన్ని నిర్దేశించుకోగా.. గడువు కంటే ఐదు నెలల ముందే విజయవంతంగా పూర్తి చేసినట్లు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి ..
పాక్ వల్లే కశ్మీరీలకు రక్షణ.. ఫరూక్ అబ్దుల్లా
ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌కు అమిత్ షా, సీఎం రేఖా గుప్తా.. శాంతిభద్రతలపై సమీక్ష