బంగాళాఖాతంలో తుఫాన్!
ABN , Publish Date - Oct 25 , 2026 | 04:37 AM
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం శనివారం ఉదయానికే తీవ్ర అల్పపీడనంగా.. రాత్రికి వాయుగుండంగా మారింది. ఇది పశ్చిమ వాయవ్యంగా పయనించి ఆదివారానికి తీవ్ర వాయుగుండంగా బలపడనుంది.
వాయుగుండంగా బలపడిన తీవ్ర అల్పపీడనం
ఎల్లుండి నుంచి 3 రోజుల పాటు భారీ వర్షాలు
హైదరాబాద్, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం శనివారం ఉదయానికే తీవ్ర అల్పపీడనంగా.. రాత్రికి వాయుగుండంగా మారింది. ఇది పశ్చిమ వాయవ్యంగా పయనించి ఆదివారానికి తీవ్ర వాయుగుండంగా బలపడనుంది. సోమవారం ఉదయానికి తుఫాన్‌గా మారి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశిస్తుంది. ఆ తర్వాత మరింత బలపడి తీవ్ర తుఫాన్‌గా మారి ఈ నెల 28వ తేదీన తీరం దాటుతుంది.
దీని ప్రభావంతో 27, 28, 29వ తేదీల్లో పలు జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. 27న యెల్లో అలెర్ట్, 28న రెడ్, ఆరెంజ్, 29న యెల్లో అలెర్ట్ జారీ చేసింది. 28న ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని.. ఆయా జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది. అలాగే భూపాలపల్లి, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, సూర్యాపేట జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, ఈ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది.
ఈ వార్తలు కూడా చదవండి:
తుమ్మిడిహెట్టిపై రేపు మహా చర్చలు
Read Latest AP News And Telangana News And International News And Telugu News