సంప్రదాయానికి భిన్నంగా.. డాలర్ నోట్లపై ట్రంప్ సంతకం
ABN , Publish Date - Jul 05 , 2026 | 12:22 PM
అమెరికాకు స్వాతంత్ర్యం వచ్చి 250 వసంతాలు పూర్తైన సందర్భంగా ఆ దేశం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ సంతకంతో కూడిన డాలర్ నోట్లను ప్రవేశపెడుతున్నట్లు యూఎస్ ట్రెజరీ విభాగం ప్రకటించింది.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికాకు స్వాతంత్ర్యం వచ్చి 250 వసంతాలు పూర్తైన సందర్భంగా ఆ దేశం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ సంతకంతో కూడిన డాలర్ నోట్లను ప్రవేశపెడుతున్నట్లు యూఎస్ ట్రెజరీ విభాగం ప్రకటించింది. అయితే.. ఈ నిర్ణయం యూఎస్ వ్యాప్తంగా రాజకీయ, ఆర్థిక వర్గాల్లో చర్చకు దారితీస్తోంది.
సాధారణంగా అమెరికన్ కరెన్సీ నోట్లపై ట్రెజరీ సెక్రటరీ, యూఎస్ ట్రెజరర్ సంతకాలు ఉంటాయి. అయితే.. ఈ సారి ప్రత్యేకంగా ట్రంప్ సంతకం ఉన్న నోట్లను విడుదల చేస్తున్నట్లు ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ తెలిపారు. అమెరికా 250వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ మేరకు ట్రంప్ షేర్ చేసిన $100 కరెన్సీ నోటు నమూనాను ఆయన రీపోస్ట్ చేస్తూ దీనిని ధ్రువీకరించారు.
వాస్తవానికి కరెన్సీ నోట్లపై దేశాధినేత పేర్లు కానీ, సంతకాలు కానీ ఉండవు. దీంతో ఇది సంప్రదాయానికి విరుద్ధమంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గతంలోనే ట్రంప్ పేరును కొన్ని సంస్థలకు అనుసంధానించగా.. ఆయా సందర్భాల్లో న్యాయస్థానాలు వ్యతిరేకించాయి. ఈ నేపథ్యంలో ఆయన సంతకంతో కూడిన కరెన్సీపై చర్చలు జోరందుకున్నాయి.
ఇవీ చదవండి:
'బాస్ ఎవరో ఆయనకు తెలుసు'.. నెతన్యాహుపై ట్రంప్ వ్యాఖ్యలు
లాహోర్ కేసు.. ఉప ప్రధాని మనవడిపై సంచలన ఆరోపణలు!