Share News

విద్యార్థితో మహిళా టీచర్ అఫైర్.. చివరికి కటకటాల పాలు

ABN , Publish Date - Aug 30 , 2026 | 06:32 PM

పవిత్రమైన గురు శిష్యుల బంధానికే మచ్చ తెచ్చేలా ఓ టీచర్ ప్రవర్తించింది. 17 ఏళ్ల విద్యార్థితో అఫైర్ పెట్టుకుని కటకటాల పాలైంది.

విద్యార్థితో మహిళా టీచర్ అఫైర్.. చివరికి కటకటాల పాలు
Florida teacher Heather Mashburn Smith

ఇంటర్నెట్ డెస్క్: అమెరికాలోని ఫ్లోరిడాలో ఉన్న ఓ హైస్కూల్లో 17 ఏళ్ల విద్యార్థితో ఒక మహిళా టీచర్ అఫైర్ పెట్టుకున్నందుకు ఆమెకు కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. ఆ తరవాత మరో పదిహేనేళ్లు ఆమెను పర్యవేక్షణలో ఉంచాలని పోలీసులను ఆదేశించింది.

హీథర్ మాష్‌బర్న్ స్మిత్ (37) అనే మహిళ పోర్ట్ షార్లెట్ హైస్కూల్లో టీచర్‌గా పనిచేసేది. అదే స్కూల్లో చదువుతున్న ఓ బాలుడితో ఆమె పాఠశాల ప్రాంగణంలోనే అసభ్యంగా ప్రవర్తించందనే ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆమెను పోలీసులు గత ఏప్రిల్‌లో అదుపులోకి తీసుకున్నారు. విచారణలో ఆమె నిజాన్ని అంగీకరించగా.. న్యాయస్థానం ఈ శిక్షను విధించింది. మైనర్‌తో అఫైర్ పెట్టుకున్నందుకు ఆమెను సస్పెండ్ చేసింది. ఇంతటి నీచమైన పనికి ఒడిగట్టినందుకు గానూ పోర్ట్ షార్లెట్ స్కూల్ యాజమాన్యం ఆమెపై మండిపడింది. ఆమె చేసింది దారుణమైన నేరమని, అది విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపుతుందని పేర్కొంది.


పెరుగుతున్న విద్యార్థులు-టీచర్ల అఫైర్లు

కాగా.. అమెరికాలో ఈ మధ్య కాలంలో విద్యార్థులు, టీచర్ల మధ్య అఫైర్లు క్రమంగా పెరుగుతున్నాయి. ఓ నివేదిక ప్రకారం.. ఇలాంటి కేసులు 2014 నుంచి 2019 వరకు 500 ఉంటే.. ఒక్క 2023లోనే 350 కేసులు నమోదయ్యాయి. ఉపాధ్యాయులకు నైతికతపై అవగాహన కల్పించకపోవడం, విద్యార్థుల్లో సోషల్ మీడియా వాడకం పెరగడం వంటి కారణాల వల్ల ఈ కేసులు ఎక్కువవుతున్నాయని ఆ నివేదిక తెలిపింది. అమెరికాలో గత నెల కూడా ఓ టీచర్ టీనేజర్‌తో అఫైర్ పెట్టకుని అరెస్టైంది.


ఇవీ చదవండి:

ప్లాస్టిక్ భూతం మధ్యన బోసిపోయిన రావిచెట్టు

షార్ప్‌ బ్రెయిన్‌ కావాలా?.. రోజువారీ ఆహారంలో ఇవి ఉండేలా చూసుకోండి..

Updated Date - Aug 30 , 2026 | 07:31 PM