ప్లాస్టిక్ భూతం మధ్యన బోసిపోయిన రావిచెట్టు
ABN , Publish Date - Aug 30 , 2026 | 03:52 PM
చుట్టూరా ప్లాస్టిక్ వ్యర్థాలు.. కాలుష్య పదార్థాలు.. అయితే అక్కడ మొలిచి నిలిచిన ఓ రావి చెట్టు ప్రకృతిని ప్రతినిత్యం పరిరక్షించాల్సిన మనిషి నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: చుట్టూరా ప్లాస్టిక్ వ్యర్థాలు.. కాలుష్య పదార్థాలు.. అయితే అక్కడ మొలిచి నిలిచిన ఓ రావి చెట్టు ప్రకృతిని ప్రతినిత్యం పరిరక్షించాల్సిన మనిషి నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపుతోంది. పర్యావరణం పట్ల మనకున్న అశ్రద్ధను గుర్తుచేస్తోంది. నల్లగొండ డంపింగ్ యార్డులో ప్లాస్టిక్ వ్యర్థాల మధ్య ఉన్న ఈ రావిచెట్టు ఆకులన్నీ రాలిపోయి బోసిపోయింది. పర్యావరణ విధ్వంసానికి ప్రత్యక్ష సాక్ష్యంగా మారిపోయిందీ వృక్షం.
వసంతాన చిగురించి, ఆహ్లాదాన్ని పంచే చెట్టు.. ఇలా కాలుష్య కోరల్లో చిక్కుకుని బోసిపోయిన దృశ్యం చూపరులను కలవరపెడుతోంది. టన్నుల కొద్దీ ప్లాస్టిక్ వ్యర్థాల నడుమ నలుగుతున్న ఆ తరువు తన ఆవేదనను వినిపిస్తోంది. ప్రకృతిని పట్టించుకోని ప్రతి ఒక్కరినీ ప్రశ్నిస్తోంది. చేజేతులా మనం నాశనం చేసుకుంటోంది ఏమిటోనని చెబుతూ పశ్చాత్తాపం కలిగిస్తోంది.
ఇవీ చదవండి:
పీడకలగా మారిన రక్షాబంధన్.. ఫార్చ్యూనర్ ఢీకొని ముగ్గురు తోబుట్టువుల మృతి
ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్‌పై ఎంపీ కపిల్ సిబల్ విమర్శలు