భారత్-యూరప్ ఎకనామిక్ కారిడార్‌కు మద్దతు ప్రకటించిన ట్రంప్
ABN , Publish Date - Sep 23 , 2026 | 02:06 PM
‘భారత్-మిడిల్ ఈస్ట్-యూరప్ ఎకనామిక్ కారిడార్ (ఐఎమ్ఈఈసీ)' ప్రాజెక్ట్‌కు ట్రంప్ తన మద్దతు ప్రకటించారు. అసలేంటీ ప్రాజెక్ట్? దీనివల్ల ప్రయోజనాలేంటి?
ఇంటర్నెట్ డెస్క్: పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల నడుమ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇంధన రవాణాకు అడ్డంకిగా ఉన్న ఇరాన్ సమస్యను ‘భారత్-మిడిల్ ఈస్ట్-యూరప్ ఎకనామిక్ కారిడార్ (ఐఎమ్ఈఈసీ)' తోనే పరిష్కరించగలమని ఆయన పేర్కొన్నారు. ప్రపంచ ఇంధన మౌలిక వసతులను ఇరాన్ నుంచి దూరం చేయడానికి ఈ ఎకనామిక్ కారిడార్ ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు. గల్ఫ్, అరబ్ దేశాల నాయకులతో జరిగిన ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘వాణిజ్య నౌకలపైన ఇరాన్ అదేపనిగా దాడులు చేస్తోంది. అందుకే ఇంధన మార్గాలు ఆ దేశ చెక్‌పోస్టులకు దూరంగా ఉండాలి. ఇంధన మౌలిక వసతులను వేరే ప్రాంతాన్ని తరలించాలి’ అని ఆయన తెలిపారు. ఇందుకోసం తాను ‘ఐఎమ్ఈఈసీ’కు పూర్తి మద్దతు ఇస్తున్నాని చెప్పారు.
అసలేంటీ ప్రాజెక్ట్?
‘భారత్-మిడిల్ ఈస్ట్-యూరప్ ఎకనామిక్ కారిడార్' ప్రాజెక్ట్ రూపకల్పన 2023 సెప్టెంబర్‌లో జరిగింది. ఆ సంవత్సరం జరిగిన జీ20 సదస్సులో దీన్ని ప్రతిపాదించారు. ఈ కారిడార్‌లో రెండు ప్రధాన మార్గాలుంటాయి. మొదటిది తూర్పు కారిడార్.. ఇది భారత్‌ను గల్ఫ్ ప్రాంతంతో కలుపుతుంది. ఇక రెండోది ఉత్తర కారిడార్.. గల్ఫ్ ప్రాంతాన్ని ఐరోపాతో ఇది అనుసంధానిస్తుంది. ఈ మార్గం అందుబాటులోకి వస్తే చమురు రవాణా సులభతరం కానుంది. అదేవిధంగా ఇంధన మార్గాలపై ఇరాన్ తన పట్టును కోల్పోతుంది. అందుకే ట్రంప్ దీనికి మద్దతు తెలిపారు.
ఈ మార్గం వల్ల దక్షిణాసియా, పశ్చిమాసియాలో వాణిజ్య పరిస్థితులూ మెరుగుపడతాయి. అలాగే ఈ ప్రాజెక్ట్ పూర్తయితే కారిడార్‌లో రైల్వే నెట్‌వర్క్‌లు నౌక–రైలు రవాణా వ్యవస్థలు అందుబాటులోకి వస్తాయి. దీనివల్ల సరకుల రవాణా వేగంగా జరగుతుంది.
ఈ వార్తలూ చదవండి
ట్రంప్‌పై సౌదీ యువరాజు ఆగ్రహం.. మాజీ అధికారి కీలక వ్యాఖ్యలు..
ఇరాన్‌ను ఒంటరిని చేయాలి.. యూఎన్‌లో ట్రంప్ ప్రసంగం