Share News

ఇరాన్‌ను ఒంటరిని చేయాలి.. యూఎన్‌లో ట్రంప్ ప్రసంగం

ABN , Publish Date - Sep 22 , 2026 | 09:32 PM

అమెరికాకు ఇరాన్ పెద్ద ముప్పుగా మారిందని అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఉగ్రవాదాన్ని ఇరాన్ ఎగదోస్తోందని ఐక్యరాజ్య సమితిలో మంగళవారం ఆయన ప్రసంగించారు.

ఇరాన్‌ను ఒంటరిని చేయాలి.. యూఎన్‌లో ట్రంప్ ప్రసంగం
Trump Speech in UN

ఇంటర్నెట్ డెస్క్: అమెరికాకు ఇరాన్ పెద్ద ముప్పుగా మారిందని అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఉగ్రవాదాన్ని ఇరాన్ ఎగదోస్తోందంటూ మండిపడ్డారు. ఐక్యరాజ్య సమితిలో మంగళవారం ఆయన ప్రసంగించారు. ఇరాన్‌ను ఆర్థికంగా ఏకాకిని చేసేందుకు ప్రపంచదేశాలు అమెరికాకు సహకరించాలని కూడా పిలుపునిచ్చారు. ఇరాన్ ఒంటరైతేనే సరకు రవాణా నౌకలపై దాడులకు అడ్డుకట్ట పడుతుందని అన్నారు. అణ్వాయుధ అభివృద్ధి లక్ష్యాన్ని వదులుకునేలా ఇరాన్‌పై ఒత్తిడి తేవాలని అన్నారు.


అయితే, యూఎస్‌లో మిడ్‌టర్మ్ ఎన్నికల తరువాత ఇరాన్‌తో డీల్ కుదరవచ్చని కూడా ట్రంప్ అన్నారు. తాను అధికారంలోకి వచ్చిన కొత్తలోనే శాంతి ఒప్పందం ప్రతిపాదనలను ఇరాన్ ముందుంచామని చెప్పారు. కానీ ఆ డీల్‌ను కాలదన్నుకుని ఇరాన్ పెద్ద తప్పు చేసిందని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఇరాన్ బలహీన స్థితిలో ఉందని, దాన్ని కప్పిపుచ్చుకునేందుకే ప్రగల్భాలు పలుకుతోందని చెప్పారు. అందరం కలిసికట్టుగా ఉంటే 51 ఏళ్లుగా ఇబ్బంది పెడుతున్న ఇరాన్ ముప్పు తొలగిపోతుందని చెప్పారు. అమెరికా వద్ద ఆయుధ నిల్వలు తగ్గుతున్నాయన్న వాదనను ట్రంప్ కొట్టిపారేశారు. ద్రోహులు, పిరికిపందలు ఇలాంటి వార్తలు వ్యాపింప చేస్తున్నారని అన్నారు. తమ వద్ద భారీగా ఆయుధ నిల్వలు ఉన్నాయని అన్నారు. సమీప భవిష్యత్తులో రష్యా, ఉక్రెయిన్ మధ్య రాజీ కుదురుతుందని చెప్పారు.


ఈ వార్తలనూ చదవండి:

భారత్‌కు శిక్ష వద్దు.. అమెరికాకు జేపీ మోర్గన్ ఛేజ్ సీఈఓ సూచన

అమెరికాలో వందల విమానాలు రద్దు.. కమ్యూనికేషన్ కేబుల్ తెగిపోవడమే కారణం..

Updated Date - Sep 22 , 2026 | 09:39 PM