ఈ నెల 28 నుంచి 30 వరకు బ్యాంకులు బంద్..
ABN , Publish Date - Sep 23 , 2026 | 01:55 PM
బ్యాంకు వినియోగదారులకు అతి ముఖ్యమైన వార్త. సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు మూడు రోజుల పాటు బ్యాంకు ఉద్యోగుల సమ్మె జరగనుంది. అయితే ఆదివారం (సెప్టెంబర్ 27) బ్యాంకులు పని చేస్తాయి.
ఇంటర్నెట్ డెస్క్: బ్యాంకు వినియోగదారులకు అతి ముఖ్యమైన వార్త. సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు మూడు రోజుల పాటు బ్యాంకు ఉద్యోగుల సమ్మె జరగనుంది. అయితే సెప్టెంబర్ 27న ఆదివారం మాత్రం బ్యాంకులు పని చేస్తాయి. వారానికి ఐదు రోజుల బ్యాంకింగ్ విధానాన్ని అమలు చేయాలనే ప్రధాన డిమాండ్‌తో యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఈ సమ్మెకు పిలుపునిచ్చింది. సెప్టెంబర్ 22న జరిగిన చర్చల్లోనూ పరిష్కారం లభించకపోవడంతో సమ్మె కొనసాగుతుందని యూనియన్లు ప్రకటించాయి (Bank Strike September 28 29 30).
ఈ సమ్మె తేదీలకు ముందు సెప్టెంబర్ 26 నాలుగో శనివారం, సెప్టెంబర్ 27 ఆదివారం ఉన్నాయి. ఆ తర్వాత సెప్టెంబర్ 28-30 వరకు సమ్మె జరగనుంది. అయితే బ్యాంకు ఉద్యోగుల సమ్మె కారణంగా ఆర్బీఐ, కీలక శాఖ కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఆదివారం నాడు బ్యాంకులు పని చేయనున్నాయి. వినియోగదారులకు ఇబ్బందులు కలగకూడదనే భావనతోనే ఈ నిర్ణయం తీసుకున్నాయి. సమ్మె సమయంలో కూడా యూపీఐ, మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ వంటి సేవలు మాత్రం అందుబాటులో ఉంటాయి (Bank Employees Strike).
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్ ఇప్పటికే తమ కస్టమర్లకు సమ్మె నేపథ్యంలో సూచనలు జారీ చేశాయి (Five Day Banking Week). శాఖల్లో నేరుగా చేసే పనులకు ఆటంకం కలిగినా డిజిటల్ సర్వీసులు యథాతథంగా పని చేస్తాయని తెలిపాయి. నగదు అవసరమున్న కస్టమర్లు ఏటీఎంలను ఉపయోగించుకోవచ్చని తెలిపాయి. కాగా, సెప్టెంబర్ 28-30 సమ్మెతో సమస్య పరిష్కారం కాకపోతే అక్టోబర్ 26 నుంచి నిరవధిక సమ్మె చేపట్టనున్నట్లు బ్యాంకు యూనియన్లు ప్రకటించాయి.
ఇవి కూడా చదవండి..
భార్య, ఇద్దరు పూజారులను చంపేశాడు.. ఎన్‌కౌంటర్‌లో మరణించాడు..
రూ.10 వేల జీతం కోసం రూ.24 కోట్ల నష్టం.. సూరత్‌లో షాకింగ్ ట్విస్ట్..