Share News

ట్రంప్‌పై సౌదీ యువరాజు ఆగ్రహం.. మాజీ అధికారి కీలక వ్యాఖ్యలు..

ABN , Publish Date - Sep 23 , 2026 | 10:41 AM

హౌతీల దాడుల కారణంగా ఉక్కిరిబిక్కిరి అవుతున్న సౌదీ అరేబియాకు అమెరికా అండగా నిలవకపోడం అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైఖరిపై సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ (ఎంబీఎస్) తీవ్ర ఆగ్రహంగా ఉన్నారట.

ట్రంప్‌పై సౌదీ యువరాజు ఆగ్రహం.. మాజీ అధికారి కీలక వ్యాఖ్యలు..
Donald Trump, MBS

ఇంటర్నెట్ డెస్క్: హౌతీల దాడుల కారణంగా ఉక్కిరిబిక్కిరి అవుతున్న సౌదీ అరేబియాకు అమెరికా అండగా నిలవకపోడం అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైఖరిపై సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ (ఎంబీఎస్) తీవ్ర ఆగ్రహంగా ఉన్నారని అమెరికా మాజీ సీనియర్ ఇంటెలిజెన్స్ అధికారి కరెన్ గిబ్సన్ వ్యాఖ్యానించారు. తన విజ్ఞప్తిని ట్రంప్ పట్టించుకోకపోవడాన్ని ఎంబీఎస్ అంత తేలిగ్గా మార్చిపోలేరని ఆయన పేర్కొన్నారు (MBS, Donald Trump).


ఇరాన్ మద్దతు ఉన్న హౌతీలు ఇటీవలి కాలంలో సౌదీ అరేబియాపై విస్తృతంగా దాడులు చేస్తున్నారు. సౌదీ నగరాలు, చమురు మౌలిక వసతులు, ఇతర కీలక ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని క్షిపణులు, డ్రోన్లతో దాడులకు పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో హౌతీలపై సైనిక చర్యకు అమెరికా సహకరించాలని సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ ట్రంప్‌ను కోరారు. అయితే ట్రంప్ ప్రభుత్వం ప్రత్యక్ష వైమానిక దాడులకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. ఈ నిర్ణయంపై ఎంబీసీ తీవ్ర ఆగ్రహంగా ఉన్నట్టు గిబ్సన్ వ్యాఖ్యానించారు (Saudi Arabia vs Houthis).


మరోవైపు, హౌతీలతో చర్చలు జరిపినట్టు ట్రంప్ వెల్లడించడం సౌదీని మరింత ఆందోళనకు గురి చేస్తోంది. అమెరికా ప్రయోజనాలకు విఘాతం కలిగించేలా దాడులు చేయబోమని హౌతీలు తమకు హామీ ఇచ్చినట్టు ట్రంప్ ఇటీవల ప్రకటించారు (US Saudi Relations). అయితే అమెరికా నుంచి సౌదీకి సహకారం లభించనప్పటికీ బ్రిటన్ మాత్రం అండగా నిలిచింది. సౌదీ రక్షణ దళాలకు ఎయిర్ టు ఎయిర్ రీఫ్యూయలింగ్ సౌకర్యాలను కల్పించనున్నట్టు ప్రకటించింది.


ఇవి కూడా చదవండి..

భార్య, ఇద్దరు పూజారులను చంపేశాడు.. ఎన్‌కౌంటర్‌లో మరణించాడు..


రూ.10 వేల జీతం కోసం రూ.24 కోట్ల నష్టం.. సూరత్‌లో షాకింగ్ ట్విస్ట్..

Updated Date - Sep 23 , 2026 | 10:51 AM