Share News

క్యాబ్ ఎక్కుతుండగా సాఫ్ట్‌వేర్ ఉద్యోగినికి ముద్దు పెట్టిన సెక్యూరిటీ గార్డు

ABN , Publish Date - Sep 23 , 2026 | 01:51 PM

మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌తో ఓ సెక్యూరిటీగార్డ్ అసభ్యంగా ప్రవర్తించిన ఘటన హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. క్యాబ్ ఎక్కుతున్న మహిళకు సెక్యూరిటీగార్డు బలవంతంగా ముద్దు పెట్టడం తీవ్ర కలకలం రేపుతోంది.

క్యాబ్ ఎక్కుతుండగా సాఫ్ట్‌వేర్ ఉద్యోగినికి ముద్దు పెట్టిన సెక్యూరిటీ గార్డు
Hyderabad News

హైదరాబాద్, సెప్టెంబర్ 24: మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌తో ఓ సెక్యూరిటీగార్డ్ అసభ్యంగా ప్రవర్తించిన ఘటన హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. క్యాబ్ ఎక్కుతున్న మహిళకు సెక్యూరిటీగార్డు బలవంతంగా ముద్దు పెట్టడం తీవ్ర కలకలం రేపుతోంది. గచ్చిబౌలిలో ఇందిరానగర్‌లో ఈ ఘటన జరిగింది. 24 ఏళ్ల సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ క్యాబ్ ఎక్కేందుకు వెళ్తుండగా అక్కడే ఉన్న సెక్యూరిటీ గార్డ్ ఆమెను పక్కకు లాగి ముద్దు పెట్టాడు. ఒక్కసారిగా జరిగిన ఘటనతో మహిళ షాక్‌కు గురయ్యారు. వెంటనే బాధితురాలు బిగ్గరగా అరవడంతో నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు.


ఈ ఘటనపై బాధితురాలు పోలీసులను ఆశ్రయించారు. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఫిర్యాదు మేరకు గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజ్‌ ఆధారంగా నిందితుడిని గుర్తించారు. జార్ఖండ్‌కు చెందిన సెక్యూరిటీ గార్డు రాజ్‌కుమార్‌ను అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరించే పనిలో పోలీసులు ఉన్నారు.


ఇవి కూడా చదవండి...

తెనాలి రైల్వేస్టేషన్‌ వద్ద తెగిన విద్యుత్ వైర్లు.. తప్పిన ప్రమాదం

‘ది ప్యారడైజ్’ కోసం నాని ప్రత్యేక విజ్ఞప్తి.. సీఎం రేవంత్ స్పందన ఇదే

Read Latest Telangana News And Telugu News

Updated Date - Sep 23 , 2026 | 02:04 PM