ఏపీలో తుది దశకు 'సర్'.. 44 లక్షల నోటీసులపై విచారణ పూర్తి: ఢిల్లీరావు
ABN , Publish Date - Sep 23 , 2026 | 01:18 PM
ఏపీలో ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ తుది దశకు చేరుకుందని అడిషనల్ సీఈవో ఢిల్లీరావు తెలిపారు. మొత్తం 44.28 లక్షల నోటీసులు జారీ చేయగా.. 44 లక్షల నోటీసులపై విచారణ పూర్తైందన్నారు.
అమరావతి, సెప్టెంబర్ 23: రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్‌ఐఆర్) ప్రక్రియ తుది దశకు చేరుకుందని అడిషనల్ సీఈవో ఢిల్లీరావు తెలిపారు. మొత్తం 44.28 లక్షల నోటీసులు జారీ చేయగా.. 44 లక్షల నోటీసులపై విచారణ పూర్తైందన్నారు. నోటీసుల పంపిణీ 99.35 శాతానికి చేరుకుందని ప్రకటించారు. ప్రస్తుతం విచారణకు 28 వేల నోటీసులు మాత్రమే పెండింగ్‌లో ఉన్నట్లు వెల్లడించారు. అల్లూరి, కర్నూలు, చిత్తూరు, విజయనగరం, అనకాపల్లి, పశ్చిమగోదావరిలో మెరుగైన ప్రగతి నమోదైందన్నారు. అయితే ఏలూరు, పల్నాడు, తిరుపతి, ప్రకాశం, అనంతపురంలో అధికంగా నోటీసులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 3.71 కోట్ల ఫొటోల్లో బీఎల్‌వోలు 3.67 కోట్ల ఫొటోలను ఆమోదించినట్లు చెప్పారు.
మరో 3.73 లక్షలు ఫొటో నాణ్యత పరిశీలన బీఎల్‌వోల వద్ద పెండింగ్‌లో ఉందని.. మొత్తం పెండింగ్ 1.01 శాతంగా ఉందని అడిషనల్ సీఈవో వెల్లడించారు. అలాగే ఈఆర్‌వోల వద్ద 8.81 లక్షల ఫొటోలు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ఫొటో ఆమోదానికి సంబంధించి 3.58 శాతం పెండింగ్‌లో ఉన్నట్లు చెప్పారు. ఫారం-6 కింద 1.41 లక్షల దరఖాస్తులు, ఫారం-7 కింద 10,742 దరఖాస్తులు, ఫారం-8 కింద 69 వేల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. ఒక్కరోజులోనే 22,856 క్లెయిమ్స్, అభ్యంతరాలను పరిష్కరించామని అన్నారు. అనర్హులుగా గుర్తించిన ప్రతి ఓటరుకు వెంటనే ఈసీఐ-నెట్‌లో ఫారం-7 రూపొందించాలని ఈసీఐ ఆదేశించినట్లు చెప్పారు. ‘ఎలెక్టర్ ఫౌండ్ ఇనెలిజిబుల్ ఫర్ ఫైనల్’గా గుర్తించిన వెంటనే ఫారం-7 జనరేట్ చేయాలని ఈసీఐ స్పష్టం చేసిందని ఆయన పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
అక్టోబర్‌లో స్థానిక ఎన్నికలు.. కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యం: మంత్రి లోకేశ్
సాయికృష్ణ కేసు.. హైకోర్టు విచారణపై స్టే విధించిన సుప్రీంకోర్టు
Read Latest AP News And Telugu News