ట్రంప్ కుమారుడి పెళ్లికి పుతిన్ స్నేహితుడి నిధులు.. దర్యాప్తు ప్రారంభించిన అమెరికన్ కాంగ్రెస్
ABN , Publish Date - Sep 16 , 2026 | 09:08 AM
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కుమారుడి పెళ్లికి రష్యా అధ్యక్షుడు పుతిన్ స్నేహితుడు నిధులు సమకూర్చారు. దీనిపై యూఎస్ కాంగ్రెస్‌లో రచ్చ మొదలైంది.
ఇంటర్నెట్ డెస్క్: గత మేలో జరిగిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమారుడు జూనియర్ ట్రంప్ పెళ్లికి ఓ రష్యా వ్యాపారవేత్త ఎందుకు నిధులిచ్చారనే దానిపై యూఎస్ కాంగ్రెస్‌లోని డెమోక్రాట్లు దర్యాప్తు చేపట్టారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్నేహితుడైన ఉమర్ క్రెమ్లెవ్ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల్లో ఒకరు. ఇంటర్‌నేషనల్ బాక్సింగ్ అసోషియేషన్‌కు ఆయన అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు.
కాగా జూనియర్ ట్రంప్, బెట్టినా వివాహానికి క్రెమ్లెవ్ భారీగా నిధులిచ్చారని వార్తలు వచ్చాయి. ఈ వార్తలు నిజమేనని ఇటీవల ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో బెట్టినా ధ్రువీకరించారు కూడా. అయితే ఇప్పుడు దీనిపై యూఎస్ కాంగ్రెస్‌లో రగడ మొదలైంది. ‘అమెరికా అధ్యక్షుడి కుమారుడి వివాహానికి రష్యా అధ్యక్షుడి స్నేహితుడు ఎందుకు నిధులు సమకూర్చారు? ఇంత చేసిన ఉమర్ క్రెమ్లెవ్ ట్రంప్ నుంచి బదులుగా ఏం ఆశిస్తున్నారు?’ అంటూ కాంగ్రెస్ సభ్యుడు రాబర్ట్ గార్సియా మంగళవారం పోస్ట్ చేశారు. దీనిపై తాను ఇతర సభ్యులతో కలిసి దర్యాప్తు ప్రారంభించానని పేర్కొన్నారు. మరోవైపు డెమోక్రటిక్ నేత చుక్ షూమర్ ఈ పెళ్లి వ్యవహారాన్ని తీవ్రంగా విమర్శించారు.
అయితే ఈ వివాదంపై ఉమర్ క్రెమ్లెవ్ స్పందించలేదు. అధ్యక్షుడు ట్రంప్ మాత్రం స్పందిస్తూ.. తాను అసలు జూనియర్ ట్రంప్ పెళ్లికే వెళ్లలేదని, అలాగే ఆ రష్యా వ్యాపారవేత్త ఎవరో తనకు తెలియదని చెప్పారు. అయినా ఇదేమీ పెద్ద విషయం కాదని వివరించారు.
ఈ వార్తలనూ చదవండి: