పీవోకేలో పాక్ ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదం.. 21 మంది మృతి
ABN , Publish Date - Jun 10 , 2026 | 05:25 PM
పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌లో ఘోర హెలికాప్టర్ ప్రమాదం చోటుచేసుకుంది. ముజఫరాబాద్ సమీపంలో పాక్ ఆర్మీకి చెందిన MI-17 హెలికాప్టర్ కూలింది. ఈ ఘటనలో 21 మంది మృతిచెందారు.
ఇంటర్నెట్ డెస్క్, జూన్ 10 (ఆంధ్రజ్యోతి): పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (POK)లో ఘోర హెలికాప్టర్ ప్రమాదం చోటుచేసుకుంది. ముజఫరాబాద్ సమీపంలో పాక్ ఆర్మీకి చెందిన MI-17 హెలికాప్టర్ కూలింది. ఈ ఘటనలో 21 మంది మృతిచెందారు.
సాంకేతిక లోపం కారణంగానే హెలికాప్టర్ కూలినట్లు అధికారులు భావిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ఆయా బృందాలు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. పాక్ ఆర్మీకి చెందిన ఈ హెలికాప్టర్ సాధారణ విధుల్లో భాగంగా ప్రయాణిస్తుండగా అకస్మాత్తుగా సాంకేతిక సమస్య తలెత్తినట్లు తెలుస్తోంది.
దీంతో నియంత్రణ కోల్పోయిన హెలికాప్టర్ ముజఫరాబాద్ ప్రాంతంలో కూలిపోయింది. ఈ ఘటనపై పాకిస్థాన్ సైన్యం విచారణకు ఆదేశించినట్లు సమాచారం. ప్రమాదానికి గల కచ్చితమైన కారణాలను గుర్తించేందుకు సాంకేతిక నిపుణులతో కూడిన ప్రత్యేక బృందం దర్యాప్తు చేపట్టనుంది.
ఈ వార్తలు కూడా చదవండి...
మీనాక్షి నటరాజన్ నామినేషన్ రద్దు ప్రజాస్వామ్యంపై దాడి: సీఎం రేవంత్‌రెడ్డి
కిషన్‌రెడ్డి బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారు.. మంత్రి ఉత్తమ్ ధ్వజం
Read Latest Telangana News And AP News And National News
And Telugu News