సహ పైలట్‌తో పోరాడి.. 180 మంది ప్రాణాలు కాపాడిన భారతీయ పైలట్
ABN , Publish Date - Sep 30 , 2026 | 05:50 PM
సహ పైలట్ దాడి చేసినా.. ప్రాణాలకు తెగించి మరీ ఆయన 180 మంది ప్రాణాలు కాపాడారు. ఓవైపు దాడిని ఎదుర్కొంటూనే.. మరోవైపు విమానం కూలిపోకుండా నియంత్రించారు.
ఇంటర్నెట్ డెస్క్: దుబాయ్ నుంచి ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్‌కు వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో ఉగ్రవాద ప్రయత్నాన్ని అదే విమానానికి కెప్టెన్‌గా ఉన్న ఓ భారతీయుడు అడ్డుకున్నారు. సహ పైలట్ దాడి చేసినా.. ప్రాణాలకు తెగించి మరీ ఆయన 180 మంది ప్రయాణికులను కాపాడారు. ఓవైపు దాడిని ఎదుర్కొంటూనే.. మరోవైపు విమానం కూలిపోకుండా నియంత్రించారు. అనంతరం ఫ్లైదుబాయ్‌లో ప్రయాణిస్తున్న ఇద్దరు ఆఫ్-డ్యూటీ పైలట్లు విమానాన్ని సురక్షితంగా సౌదీ అరేబియాలో ల్యాండ్ చేశారు. ఈ విషయాన్ని ఇజ్రాయెల్‌కు చెందిన వార్త సంస్థలు వెల్లడించాయి. దాడిలో భారతీయ కెప్టెన్‌కు గాయాలయ్యాయి.
కాగా ఒమన్‌కు చెందిన పైలట్ ఈ విమానాన్ని కూల్చడానికి ప్రయత్నించాడని సమాచారం. దీనికి అడ్డుగా ఉన్న భారతీయ పైలట్‌పై కత్తితో దాడి చేసినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో భారతీయ పైలట్ అతడితో పోరాడి.. ప్రయాణికులను రక్షించారు. ప్రస్తుతం ఇద్దరు పైలట్లు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఈ వార్తలూ చదవండి
దుబాయ్-టెల్ అవీవ్ విమానంలో ఏం జరిగింది..
దుబాయ్–టెల్ అవీవ్ విమానంలో హైజాక్ సంకేతాలు..