Share News

జర్మనీలో అగ్నిప్రమాదం.. ముగ్గురు భారతీయుల మృతి!

ABN , Publish Date - Oct 14 , 2026 | 08:49 PM

జర్మనీలోని బొచుమ్‌ నగరంలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో ముగ్గురు భారతీయ జాతీయులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.

జర్మనీలో అగ్నిప్రమాదం.. ముగ్గురు భారతీయుల మృతి!
Germany Fire News

ఇంటర్నెట్ డెస్క్: జర్మనీలోని బొచుమ్‌ నగరంలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో ముగ్గురు భారతీయ జాతీయులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. బొచుమ్‌లోని హోఫ్‌స్టెడ్ ప్రాంతంలో ఉన్న ఓ బహుళ అంతస్తుల నివాస భవనంలో మంగళవారం తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.


ఈ ప్రమాదంలో భారతీయులైన ఇద్దరు యువతులు, ఒక యువకుడు మృతి చెందారని స్థానిక జర్మన్ మీడియా వెల్లడించింది. ఈ భవనంలోనే నివసిస్తున్న 41 ఏళ్ల రోమేనియా జాతీయుడైన వ్యక్తి కావాలనే ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మంటలు మెట్ల మార్గం గుండా పైఅంతస్తులకు వేగంగా వ్యాపించడంతో సహాయక చర్యలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.


అగ్నిమాపక సిబ్బంది ఐదుగురిని రక్షించి ఆసుపత్రికి తరలించారు. అయితే, పొగ పీల్చడం వల్ల స్పృహాతప్పిన ముగ్గురు భారతీయులు అక్కడికక్కడే మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. షార్ట్‌ సర్క్యూట్‌ కాకుండా ఇది ఉద్దేశపూర్వకంగా నిప్పు పెట్టడంతో జరిగిన ప్రమాదం కావొచ్చని పోలీసులు భావిస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

ఏపీ స్థానిక ఎన్నికల్లో టీడీపీ-జనసేన పొత్తు ఖరారు.. సీట్ల సర్దుబాటుపై ఏకాభిప్రాయం

డీజీసీఏ కీలక నిర్ణయం... విమానాల్లో ఆ పవర్‌ బ్యాంకులపై నిషేధం

ఆటోమేటిక్ వర్క్ పర్మిట్ ఎక్స్‌టెన్షన్‌ రద్దు.. అమెరికా ప్రభుత్వం వెల్లడి

సర్‌కు వ్యతిరేకంగా 2 లక్షల మందితో మార్చ్: టీపీసీసీ చీఫ్

Updated Date - Oct 14 , 2026 | 08:53 PM