డీజీసీఏ కీలక నిర్ణయం... విమానాల్లో ఆ పవర్ బ్యాంకులపై నిషేధం
ABN , Publish Date - Oct 14 , 2026 | 07:57 PM
ఇటీవల ఢిల్లీ నుంచి చెన్నైకి వెళ్తున్న ఇండిగో విమానంలో పవర్ బ్యాంక్ కారణంగా చిన్నపాటి అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఆ విమానంలోని ఓ ప్రయాణికుడి పవర్ బ్యాంక్ నుంచి మంటలు చెలరేగాయి.
ఇంటర్నెట్ డెస్క్: ఇటీవల ఢిల్లీ నుంచి చెన్నైకి వెళ్తున్న ఇండిగో విమానంలో పవర్ బ్యాంక్ కారణంగా చిన్నపాటి అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఆ విమానంలోని ఓ ప్రయాణికుడి పవర్ బ్యాంక్ నుంచి మంటలు చెలరేగాయి. సిబ్బంది వెంటనే అప్రమత్తమై మంటలార్పి.. విమానాన్ని శంషాబాద్లో అత్యవసర ల్యాండింగ్ చేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ నేపథ్యంలో పవర్ బ్యాంక్ల విషయంలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) కీలక నిర్ణయం తీసుకుంది.
విమానాల్లో మొబికిన్స్ ఎంకే-పీబీ-04 మోడల్ పవర్బ్యాంకులపై (power bank) నిషేధం విధించింది. ఈ మోడల్ పవర్బ్యాంక్ను విమానంలో తీసుకువెళ్లడం, రవాణా చేయడం జరగకుండా చూసుకోవాలని విమానయాన సంస్థలను డీజీసీఏ ఆదేశించింది. లగేజ్ బ్యాగ్లు, క్యాబిన్ బ్యాగుల్లో గానీ వీటిని తీసుకెళ్లొద్దని ప్రయాణికులకు సూచించింది.
అలానే కార్గోలో కూడా వీటిని అనుమతించవద్దని విమానయాన సంస్థలకు ఆదేశాలిచ్చింది. భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. పవర్ బ్యాంకుల తయారీలో సాధారణంగా లిథియం-అయాన్ లేదా లిథియం-పాలిమర్ బ్యాటరీలను ఉపయోగిస్తారు. అంతర్గత షార్ట్ సర్క్యూట్ లేదా ఇతర లోపాల కారణంగా ఈ బ్యాటరీలు అధిక వేడికి గురవుతాయని ఆటోమెబైల్ నిపుణులు చెబుతున్నారు.
ఈ వార్తలూ చదవండి
రేపటి నుంచే విజయవాడ ‘సరస్ మేళా’.. పనులను పరిశీలించిన ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని
క్షణాల్లో చేతులతోనే ఇనుప పెనాన్ని చుట్టేశాడు.. వీడియో వైరల్
అడవి నుంచి వింత శబ్దాలు.. వెళ్లి చూస్తే షాక్.. వీడియో