Share News

ఇంద్రకీలాద్రిపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. అమ్మవారికి ప్రత్యేక పూజలు

ABN , Publish Date - Oct 14 , 2026 | 08:19 PM

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న రాష్ట్రపతికి రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, ఎంపీలు కేశినేని చిన్ని, శ్రీకృష్ణదేవరాయలు తదితరులు మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు.

ఇంద్రకీలాద్రిపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. అమ్మవారికి ప్రత్యేక పూజలు
Droupadi Murmu

విజయవాడ, అక్టోబర్ 14: ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న రాష్ట్రపతికి రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు, దుర్గగుడి చైర్మన్ బొర్రా గాంధీ తదితరులు ఘనస్వాగతం పలికారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ పూర్ణకుంభంతో ఆలయ మర్యాదల ప్రకారం రాష్ట్రపతికి స్వాగతం పలికారు. అనంతరం రాష్ట్రపతి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వేద మంత్రోచ్ఛారణల మధ్య రాష్ట్రపతికి ఆశీర్వచనం అందించారు.


అమ్మవారి దర్శనం అనంతరం వేద పండితులు రాష్ట్రపతికి వేద ఆశీర్వచనం అందించి తీర్థప్రసాదాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు శ్రీ కనకదుర్గమ్మ లడ్డూ ప్రసాదంతో పాటు అమ్మవారి చిత్రపటాన్ని రాష్ట్రపతికి అందజేశారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో ఆలయ పరిసరాల్లో అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేశారు. అమ్మవారి దర్శనం, ప్రత్యేక పూజలు పూర్తయిన అనంతరం ద్రౌపది ముర్ము ఇంద్రకీలాద్రి నుంచి తన కాన్వాయ్‌లో బయలుదేరారు.


ఈ వార్తలు కూడా చదవండి..

పవన్ సమక్షంలో జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ

మటన్ మండిలో పుచ్చిపోయిన పన్ను.. హైదరాబాద్ రెస్టారెంట్‌లో కలకలం

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 14 , 2026 | 08:22 PM