అమెరికా భవిష్యత్తు అధ్యక్షుడు మాకు వ్యతిరేకం కావచ్చు: నెతన్యాహు
ABN , Publish Date - Oct 19 , 2026 | 07:34 PM
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు షాకింగ్ కామెంట్లు చేశారు. అమెరికా భవిష్యత్తు అధ్యక్షుడు ఇజ్రాయెల్‌కు వ్యతిరేకం కావచ్చని ఆయన పేర్కొన్నారు. అమెరికాకు కాబోయే అధ్యక్షుడు తమపై మిలిటరీ ఆంక్షలు విధించవచ్చని, అంతేకాకుండా ఇజ్రాయెల్‌పై అంతర్జాతీయంగా ఉన్న ఆంక్షలకు కూడా మద్దతు తెలపవచ్చని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు షాకింగ్ కామెంట్లు చేశారు. అమెరికా భవిష్యత్తు అధ్యక్షుడు ఇజ్రాయెల్‌కు వ్యతిరేకం కావచ్చని ఆయన పేర్కొన్నారు. అమెరికాకు భవిష్యత్తులో కాబోయే అధ్యక్షుడు తమపై మిలిటరీ ఆంక్షలు విధించవచ్చని, అంతేకాకుండా ఇజ్రాయెల్‌పై అంతర్జాతీయంగా ఉన్న ఆంక్షలకు కూడా మద్దతు తెలపవచ్చని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో భారత్‌తో పాటు ల్యాటిన్ అమెరికా దేశాలతో సంబంధాలు మరింత మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఉందని నెతన్యాహు పేర్కొన్నట్లు ‘ద జెరూసలెం పోస్ట్, ‘వైనెట్ న్యూస్’ తెలిపాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదవీకాలం ముగిసే వరకూ ఇజ్రాయెల్‌ను మరింత బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందని నెతన్యాహు అన్నారు. అలాగే ఇండియాతో పాటు ల్యాటిన్ అమెరికా దేశాలతోనూ ఇజ్రాయెల్ సంబంధాలు మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
‘ట్రంప్ పదవీకాలం ఇంకో రెండేళ్లు మాత్రమే ఉంది. తర్వాత అమెరికాకు కొత్త ప్రెసిడెంట్ వస్తారు. అది పురుషుడు లేదా మహిళ కావచ్చు. కొత్త ప్రెసిడెంట్ మాకు వ్యతిరేకంగా ఉండవచ్చు. అలాంటి పరిస్థితుల్లో అమెరికాతో ఇజ్రాయెల్ తన సంబంధాలను ఎలా కొనసాగిస్తుంది?’ అని నెతన్యాహు వ్యా్ఖ్యానించారు. కాగా.. గాజాలో హమాస్‌తో పాటు లెబనాన్, ఇరాన్లో హెజ్బొల్లాపై ఇజ్రాయెల్ యుద్ధం చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తారస్థాయికి చేరాయి. మరోవైపు ఇజ్రాయెల్‌పై అంతర్జాతీయంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ యుద్ధ నేరాలపై దర్యాప్తు చేయాలని అమెరికా డెమోక్రటిక్ పార్టీతో పాటు సెనేటర్లు డిమాండ్ చేశారు.
ఈ వార్తలూ చదవండి:
విజయవాడ ఉత్సవ్ ముగింపు వేడుకలు.. 2 వేల మంది కళాకారులతో దసరా కార్నివాల్
టైగర్ ష్రాఫ్‌పై కాల్పుల ఘటన.. బయటకొచ్చిన నిందితుల ఫొటో