Share News

ట్రంప్ ఎఫెక్ట్.. అమెరికాలో సగానికి పడిపోయిన వలసలు

ABN , Publish Date - Oct 19 , 2026 | 09:38 AM

ట్రంప్ సర్కారు విధానాలతో అమెరికాలోకి వలసలు సగానికి పడిపోయాయి.

ట్రంప్ ఎఫెక్ట్.. అమెరికాలో సగానికి పడిపోయిన వలసలు
US Immigrant Visa Issuance Fell by Half

ఇంటర్నెట్ డెస్క్: ట్రంప్ సర్కారు విధానాలతో అమెరికాలోకి వలసలు సగానికి పడిపోయాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో కేవలం 26 వేల ఇమ్మిగ్రెంట్ వీసాలు (శాశ్వత నివాస అనుమతులు) జారీ కాగా ట్రంప్ అధికారంలోకి రాకమునుపు ఫిబ్రవరిలో సగటు వీసాల జారీ ఏకంగా 52 వేలుగా ఉందని న్యూయార్క్ టైమ్స్ ఓ విశ్లేషాత్మక కథనాన్ని ప్రచురించింది. వలసల కట్టడికి ట్రంప్ గత రెండు ఏళ్లుగా వివిధ రకాల విధానాలను తీసుకొచ్చిన విషయం తెలిసిందే.


ట్రంప్ విధానాల కారణంగా 91 దేశాల వారికి అమెరికాకు వలసవెళ్లడం చాలా కష్టంగా మారిపోయింది. మరో 61 దేశాలకు యూఎస్ ఇమ్మిగ్రెంట్ వీసాల జారీ తగ్గిపోయింది. వలసదారులతో అమెరికా ఖజానాపై భారం పడకుండా, భద్రతా పరమైన సమస్యలు తలెత్తకుండా వీసా నిబంధనలను కట్టుదిట్టం చేసినట్టు అమెరికా ప్రభుత్వం ఇప్పటికే పలుమార్లు చెప్పింది.


మీడియా కథనం ప్రకారం, సెంట్రల్ ఆసియా దేశాలకు ఇమ్మిగ్రెంట్ వీసా జారీ 99 శాతం మేర తగ్గిపోయింది. ఆఫ్రికా విషయంలో 89 శాతం మేర, తూర్పు ఐరోపా దేశాలకు 84 శాతం మేర కోత పడింది. పశ్చిమాసియాకు ఇమ్మిగ్రెంట్ వీసాల్లో 81 శాతం, ఆస్ట్రేలియా, పసిఫిక్ ద్వీప దేశాల వీసాల్లో కూడా 71 శాతం మేర కోత పడింది. దక్షిణాసియా దేశాల వారికి జారీ చేసే ఇమ్మిగ్రెంట్ వీసాలు 63 శాతం మేర తగ్గిపోయాయి. దక్షిణ అమెరికా ఇమ్మిగ్రెంట్ వీసాల్లో 60 శాతం కోత పడింది. తూర్పు ఆసియా, సెంట్రల్ అమెరికా దేశాల వారికి ఇమ్మిగ్రెంట్ వీసాలు 33 శాతం వరకూ తగ్గాయి. పశ్చిమాసియా దేశాల వారి విషయంలో కేవలం 16 శాతం మాత్రమే తగ్గింది. కెనడా, మెక్సికో నుంచి మాత్రం వలసలు పెరిగాయి. కెనడాకు ఇమ్మిగ్రెంట్ వీసాల జారీ 142 శాతం మేర పెరగ్గా మెక్సికోకు 17 శాతం మేర పెరిగింది. 2023, 2024 నాటి నెలవారీ సగటుతో పోలిస్తే ఈ మేరకు మార్పు కనిపించినట్టు న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది.


ఈ వార్తలనూ చదవండి:

భారత్‌పై అదనపు సుంకాలు విధించమంటే వాళ్లు కుదరదన్నారు: యూఎస్ మంత్రి

హెచ్‌1బీ వీసాదారులకు వ్యతిరేకం కాదు: జేడీ వాన్స్

Updated Date - Oct 19 , 2026 | 09:51 AM