Share News

అమెరికా దౌత్యాన్ని వీడి బెదిరింపుల బాట పట్టింది.. ఇరాన్ విదేశాంగ మంత్రి అరాగ్చీ ఆరోపణలు

ABN , Publish Date - Oct 18 , 2026 | 07:37 PM

ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ అమెరికాపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఇరాన్ తన సార్వభౌమ హక్కుల విషయంలో వెనక్కి తగ్గదని, పరస్పర గౌరవం, విశ్వసనీయమైన హామీల ఆధారంగా చర్చలకు సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.

అమెరికా దౌత్యాన్ని వీడి బెదిరింపుల బాట పట్టింది.. ఇరాన్ విదేశాంగ మంత్రి అరాగ్చీ ఆరోపణలు
Iran Foreign Minister Abbas Araghchi

బాగ్దాద్, అక్టోబర్ 18: ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లో జరిగిన ఇస్లామిక్ సహకార సంస్థ విదేశాంగ మంత్రుల సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత సంఘర్షణ వేళ అమెరికా దౌత్య మార్గాన్ని విడనాడి.. దురాక్రమణ, బెదిరింపులు, హత్యలు, ఆర్థిక యుద్ధం వంటి మార్గాలను ఎంచుకుందని అరాఘ్చీ తీవ్రంగా ఆరోపించారు. ఐక్యరాజ్యసమితి చార్టర్‌ను, అంతర్జాతీయ చట్టాలను అమెరికా బేఖాతరు చేస్తోందని మండిపడ్డారు.

ఇరాన్ ఎప్పుడూ ఒత్తిడికి, బెదిరింపులకు లేదా బలవంతపు చర్యలకు తలవంచబోదని, తన సార్వభౌమ హక్కులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోదని స్పష్టం చేశారు. అయితే, పరస్పర గౌరవం, విశ్వసనీయమైన హామీల ఆధారంగా చర్చలు జరపడానికి తాము ఎప్పుడూ సిద్ధంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు.

ఈ సదస్సులో భాగంగా ఇరాక్ ప్రధాని అలీ అల్-జైదీని కలిసిన అరాగ్చీ, దౌత్య ప్రక్రియలను అమెరికా పదేపదే భగ్నం చేస్తోందని ఆరోపించారు. మరోవైపు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ.. ఇరాన్‌తో జరుగుతున్న ఈ యుద్ధం త్వరలోనే ముగిసిపోతుందని, ఆ తర్వాత దేశంలో గ్యాస్ ధరలు భారీగా పడిపోతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మున్సిపల్ ఎన్నికలు.. మేయర్ అభ్యర్థులపై ఉత్కంఠ.. సీఎం నిర్ణయంపై ఆసక్తి

రాయచోటి, పుంగనూరు ఘటనలపై నివేదిక కోరాం.. చర్యలు తీసుకుంటాం: ఏపీ ఎస్‌ఈసీ

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 18 , 2026 | 07:42 PM