ఒక్క రోజులో విధానాన్ని మార్చుకోవడం కష్టం!
ABN , Publish Date - Oct 19 , 2026 | 06:16 AM
రష్యా నుంచి ఇంధనం కొనుగోలు చేసే విషయంలో భారత్ వంటి పెద్ద దేశాలు ఒక్కరోజులోనే విధానాన్ని మార్చుకోవడం కష్టమని.. అలా జరుగుతుందని కూడా ఆశించలేమని..
రష్యా నుంచి భారత్ ఇంధన కొనుగోళ్లపై అమెరికా మంత్రి
వాషింగ్టన్, అక్టోబరు 18: రష్యా నుంచి ఇంధనం కొనుగోలు చేసే విషయంలో భారత్ వంటి పెద్ద దేశాలు ఒక్కరోజులోనే విధానాన్ని మార్చుకోవడం కష్టమని.. అలా జరుగుతుందని కూడా ఆశించలేమని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో వ్యాఖ్యానించారు. సోమవారం నుంచి భారత్‌లో పర్యటించేందుకు బయలుదేరిన ఆయన.. శనివారం వాషింగ్టన్‌లో మీడియాతో మాట్లాడారు. రష్యా నుంచి చమురు దిగుమతులను భారత్ ఇప్పటికే స్వచ్ఛందంగా చాలా వరకు తగ్గించిందని, ప్రత్యామ్నాయ మార్గాలను కూడా అన్వేషిస్తోందని పేర్కొన్నారు. భారత్ తమకు మిత్ర, భాగస్వామ్య దేశమని తెలిపారు.