క్యూబాకు చమురు అమ్మితే.. సుంకాలు విధిస్తాం: ట్రంప్ హెచ్చరిక
ABN , Publish Date - Jan 30 , 2026 | 08:55 AM
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. క్యూబా లక్ష్యంగా మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ దేశానికి చమురు సరఫరా చేసే ఏ దేశానికైనా సుంకాలు విధిస్తామని హెచ్చరించారు.
ఇంటర్నెట్ డెస్క్: క్యూబాకు ఇకపై ఏ దేశమైనా చమురు అమ్మినా లేదా సరఫరా చేసినా ఆ దేశం నుంచి వచ్చే వస్తువులపై సుంకాలు విధిస్తామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఈ మేరకు సంబంధిత కార్యనిర్వాహక ఉత్తర్వులపై తాజాగా ఆయన సంతకం చేశారు. క్యూబా ప్రభుత్వం.. అమెరికా జాతీయ భద్రతకు, విదేశాంగ విధానానికి తీవ్రమైన ముప్పుగా మారిందని పేర్కొన్నారు ట్రంప్.
కమ్యూనిస్టుల పాలనలో ఉన్న క్యూబాపై మరింత ఒత్తిడి తెచ్చేందుకు ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు పలు మీడియా కథనాల ద్వారా తెలుస్తోంది. తాజా ఉత్తర్వులు శుక్రవారం(జనవరి 30) అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానున్నాయి. ట్రంప్ తీసుకున్న నిర్ణయం మెక్సికోపై మరింత ఒత్తిడి తేనుంది. ఈ మధ్యే మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షిన్‌బామ్.. తమ ప్రభుత్వం క్యూబాకు చమురు సరఫరా తాత్కాలికంగా నిలిపివేసినట్లు ధ్రువీకరించారు. అయితే.. అమెరికా ఒత్తిడి వల్ల ఈ నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారామె.
ఈ వార్తలు కూడా చదవండి..
సల్లంగ చూసేందుకు సమ్మక్క వచ్చె!