వాన్స్‌తో భేటీ.. కాసేపటికే ఊడిన జకారియా ఉద్యోగం
ABN , Publish Date - Oct 17 , 2026 | 05:28 PM
వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టిన కేటీ జకారియాను ఆ పదవి నుంచి తొలగించారు. ఉద్యోగ బాధ్యతలు చేపట్టిన 5 రోజులకే ఆమెను తొలగించారు. రోజులాగే శుక్రవారం జకారియా తన కార్యాలయానికి వచ్చారు.
ఇంటర్నెట్ డెస్క్: వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టిన కేటీ జకారియాను ఆ పదవి నుంచి తొలగించారు. ఉద్యోగ బాధ్యతలు చేపట్టిన 5 రోజులకే ఆమెను తొలగించారు. రోజులాగే శుక్రవారం జకారియా తన కార్యాలయానికి వచ్చారు. ముందుగా రూజ్వెల్ట్ గదిలో కమ్యూనికేషన్ల టీంతో ఆమె భేటీ అయ్యారు. ఒంటి గంటకు తన వెస్ట్ వింగ్ కార్యాలయంలో వాల్ స్ట్రీట్ జర్నల్(డబ్ల్యూఎస్‌జే) కు ఇంటర్వ్యూ ఇస్తున్నారు. ఆ ఇంటర్వ్యూ జరుగుతుండగా.. అమెరికా అధ్యక్షుడికి సీనియర్ సలహాదారు మిల్లర్ తలుపు తట్టి జకారియాను పిలిచారు. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌తో సమావేశం ఉందని చెప్పి మిల్లర్ వెళ్లిపోయారు. తర్వాత వాన్స్‌తో జకారియా భేటీ అయ్యారు. ఈ సమావేశం జరిగిన కొన్ని నిమిషాలకే తనను వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీగా తొలగిస్తున్నట్లు ట్రంప్ కార్యాలయం నుంచి జకారియాకు సందేశం అందింది. ఆమె పనితీరు బాగోలేదంటూ, అందువల్లే ఆ పదవి నుంచి తొలగిస్తున్నట్లు ఆమెకు చెప్పారు. ఆ సమయంలో ట్రంప్ తన హెలిప్యాడ్ వద్ద ఉన్నారని, శుక్రవారం జకారియాతో మాట్లాడానని డబ్ల్యూఎస్‌జే తెలిపింది.
కేటీకి ఆ పదవి అవసరం లేదు
కేటీ జకారియాకు వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ అవసరం లేదని ఆమెకు చెప్పానని ట్రంప్ తెలిపారు. ఆమెను తొలగించిన తర్వాత మీడియాతో ట్రంప్ మాట్లాడారు. తాను జకారియా స్థానంలో ఉంటే, ఆ పదవిలో కొనసాగడంపై ఆలోచిస్తానని, ఇదే విషయాన్ని జకారియాకు చెప్పానని తెలిపారు. కాగా.. తనను తొలగించిన తర్వాత జకారియా స్పందించారు. తనకు దొరికిన 5 రోజుల సమయంలో తాను చేయగలిగిందంతా చేశానని వాల్ స్ట్రీట్ జర్నల్‌కు చెప్పారు. అమెరికా ప్రజలు, అధ్యక్షుడు ట్రంప్‌కు సేవ చేయడమే తన లక్ష్యమని ఆమె పేర్కొన్నారు.
జకారియా చట్టూ వివాదాలు
వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కేటీ జకారియా మీడియా సమావేశంలో మాట్లాడారు. అయితే, ఆ సమావేశం కొద్ది నిమిషాల్లోనే ముగిసింది. తాను లాయర్నని, కొన్నేళ్ల క్రితం చైనాలోని ఓ లా సంస్థలో పనిచేశానని పేర్కొన్నారు. అయితే, ఎక్కడ బార్ ఎగ్జామ్ పాస్ అయ్యారో ఆమె వెల్లడించలేదు. అసలు ఆమె బార్ ఎగ్జామ్ పాస్ కాలేదని వాల్ స్ట్రీట్ జర్నల్ తర్వాత తెలిపింది. కాగా.. జకారియాను మరో స్థానంలో నియమిస్తామని వైట్ హౌస్ వెల్లడించింది.
ఈ వార్తలూ చదవండి
రైతులకు మహారాష్ట్ర ఐఏఎస్, ఐపీఎస్‌ల అండ.. సహాయనిధికి ఒక్కరోజు జీతం.
‘ఫుట్‌పాత్ ఏర్పాటు చేయకపోతే ధర్నాకు దిగుతాం’.. సుప్రీంకోర్టు హెచ్చరిక