Share News

భారత్‌కు భారీ ఊరట.. రష్యా ఆంక్షలపై ట్రంప్ కీలక నిర్ణయం..

ABN , Publish Date - Oct 17 , 2026 | 08:48 AM

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రష్యా నుంచి చమురు, సహజ వాయువును కొనుగోలు చేసే దేశాలపై విధించేందుకు ఉద్దేశించిన ఆంక్షల బిల్లు అమలును తాత్కాలికంగా నిలిపివేశారు.

భారత్‌కు భారీ ఊరట.. రష్యా ఆంక్షలపై ట్రంప్ కీలక నిర్ణయం..
India Russian oil imports

ఇంటర్నెట్ డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రష్యా నుంచి చమురు, సహజ వాయువును కొనుగోలు చేసే దేశాలపై విధించేందుకు ఉద్దేశించిన ఆంక్షల బిల్లు అమలును తాత్కాలికంగా నిలిపివేశారు. దీంతో రష్యా నుంచి భారీగా ముడి చమురు దిగుమతి చేసుకుంటున్న భారత్, చైనాకు ఊరట లభించనుంది. అక్టోబర్ 18 నుంచి ఈ చట్టం అమల్లోకి రావాల్సి ఉంది. అయితే ఈ చట్టం అమలును నిలిపి వేస్తూ అక్టోబర్ 16న ట్రంప్ కార్యనిర్వాహక ఉత్తర్వులు జారీ చేశారు (Trump Russia sanctions).


రష్యా నుంచి చమురు, సహజ వాయువును కొనుగోలు చేసే ప్రధాన దేశాలపై గరిష్ఠంగా 100 శాతం వరకు అదనపు సుంకాలు విధించే అధికారాన్ని అమెరికా కొత్త చట్టం కల్పించింది. ఈ చర్యలు అమలులోకి వచ్చి ఉంటే భారత్, చైనా వంటి దేశాల నుంచి అమెరికాకు వెళ్లే వస్తువులపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉండేది. భారత్ తన ఇంధన అవసరాల కోసం రష్యా నుంచి భారీగా ముడి చమురును దిగుమతి చేసుకుంటోంది. అమెరికా అదనపు సుంకాలు విధిస్తే భారత ఎగుమతిదారులపై ఒత్తిడి పెరిగే ప్రమాదం ఉండేది. అయితే, ట్రంప్ తాజా ఉత్తర్వులతో ఆ సుంకాల అమలు ప్రస్తుతానికి నిలిచిపోయింది. భారత్‌కు తక్షణ ఉపశమనం లభించినప్పటికీ, భవిష్యత్తులో మళ్లీ ఆంక్షలు విధించే అవకాశం పూర్తిగా తొలగిపోలేదు (India Russian oil imports).


ఆంక్షల బిల్లు (Lindsey Graham Act) అమలును నిలిపివేయడానికి అమెరికా జాతీయ ప్రయోజనాలే కారణమని ట్రంప్ పేర్కొన్నారు. ఈ మేరకు కాంగ్రెస్‌కు అవసరమైన ధ్రువీకరణను సమర్పించినట్లు కార్యనిర్వాహక ఉత్తర్వులో వెల్లడించారు. అంతర్జాతీయ ఇంధన మార్కెట్లలో ధరల ఒత్తిడి, అమెరికాలో ఇంధన వ్యయాలు వంటి అంశాలు ఈ నిర్ణయం వెనుక ఉన్నాయని తెలిపారు. రష్యా నుంచి ఇంధన సరఫరాలపై ఆంక్షలు మరింత కఠినతరం చేస్తే ప్రపంచ మార్కెట్లలో సరఫరా, ధరలపై ప్రభావం పడే అవకాశం ఉంది.


ఇవి కూడా చదవండి..

బంగారం ధరలు మళ్లీ కిందకే.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..


ఐదు రోజులకే పదవి పోయింది.. ట్రంప్ సంచలన నిర్ణయం!

Updated Date - Oct 17 , 2026 | 09:00 AM