Share News

ఈనెల 24 వరకు సౌదీకి విమాన సర్వీసుల బంద్

ABN , Publish Date - Oct 17 , 2026 | 03:25 PM

గల్ఫ్ దేశాల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతుండడంతో విమానయాన సంస్థలు సౌదీకి తమ సర్వీసులను ఈనెల 24 వరకు నిలిపివేశాయి. ఈ మేరకు ఆ సంస్థలు శనివారం ఒక ప్రకటన విడుదల చేశాయి. ఇండిగో, ఆకాశ ఎయిర్ విమానయాన సంస్థలు భారత్ నుంచి సౌదీకి తమ విమాన రాకపోకలను ఈనెల 24 వరకు రద్దుచేయగా.. ఎయిర్ ఇండియా ఈనెల 20 వరకు తన సర్వీసులను క్యాన్సిల్ చేసింది.

ఈనెల 24 వరకు సౌదీకి విమాన సర్వీసుల బంద్

ఇంటర్‌నెట్ డెస్క్: గల్ఫ్ దేశాల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతుండడంతో విమానయాన సంస్థలు సౌదీకి తమ సర్వీసులను ఈనెల 24 వరకు నిలిపివేశాయి. ఈ మేరకు ఆ సంస్థలు శనివారం ఒక ప్రకటన విడుదల చేశాయి. ఇండిగో, ఆకాశ ఎయిర్ విమానయాన సంస్థలు భారత్ నుంచి సౌదీకి తమ విమాన రాకపోకలను ఈనెల 24 వరకు రద్దుచేయగా.. ఎయిర్ ఇండియా ఈనెల 20 వరకు తన సర్వీసులను క్యాన్సిల్ చేసింది. అంతకుముందు ఈ సంస్థలు ఈనెల 17 వరకు తమ సర్వీసులను రద్దుచేసిన విషయం తెలిసిందే. గల్ఫ్ దేశాల్లో పరిస్థితులు మెరుగుపడకపోవడంతో విమాన సర్వీసుల రద్దును ఈనెల 24 వరకు పొడిగించాయి. ‘సౌదీ అరేబియాలో పరిస్థితిని ఎప్పటికపుడు పరిశీలిస్తున్నాం. ఉద్రిక్తతల నేపథ్యంలో రియాద్, జెద్దా, దమ్మం, మదీనాకు మా సర్వీసులను ఈనెల 24 వరకు రద్దు చేయాలని నిర్ణయించాం. ప్రభావిత కస్టమర్లకు ఈ మేరకు నోటిఫికేషన్లు పంపాం. వారికి ఎప్పటికపుడు సమాచారం అందిస్తున్నాం’ అని ఇండిగో ఒక ప్రకటనలో తెలిపింది. కాగా.. ఢిల్లీ, హైదరాబాద్, ముంబై నుంచి రియాద్‌కు ఇండిగో విమాన సర్వీసులు నడుపుతోంది.


పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో రియాద్‌కు భారత్ నుంచి విమానాల రాకపోకలను ఈనెల 24 వరకు నిలిపివేయాలని నిర్ణయించామని ఆకాశ ఎయిర్ ఒక ప్రకటనలో వెల్లడించింది. అలాగే, జెద్దాకు ఈనెల 21 వరకు విమాన సర్వీసులను పొడిగించామని ఆకాశ ఎయిర్ తెలిపింది. ఇక ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ కూడా దమ్మం, జెద్దా, రియాద్‌కు తమ సర్వీసులను ఈనెల 20 వరకు నిలిపివేశాయి. ఈ మేరకు ఆ రెండు సంస్థలు ఒక ప్రకటన విడుదల చేశాయి. కాగా.. కేరళలోని కోజికోడ్ నుంచి రియాద్‌కు రోజువారీ విమానాలను.. బెంగళూరు, కోచి, కన్నూర్ నుంచి వారానికి మూడు విమానాలను ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ నడుపుతోంది. అలాగే బెంగళూరు, మంగళూరు, ఢిల్లీ నుంచి దమ్మంకు.. కోజికోడ్, మంగళూరు, బెంగళూరు నుంచి జెద్దాకు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు నడుపుతున్నది.


ఈ వార్తలూ చదవండి

రైతులకు మహారాష్ట్ర ఐఏఎస్, ఐపీఎస్‌ల అండ.. సహాయనిధికి ఒక్కరోజు జీతం.

‘ఫుట్‌పాత్‌ ఏర్పాటు చేయకపోతే ధ‌ర్నాకు దిగుతాం’.. సుప్రీంకోర్టు హెచ్చరిక

Updated Date - Oct 17 , 2026 | 04:22 PM