స్టార్ హీరోకు షాక్.. అక్రమ కట్టడాల కూల్చివేత
ABN , Publish Date - Oct 17 , 2026 | 01:01 PM
బాలివుడ్ స్టార్ అజయ్ దేవ్‌గణ్‌కు చెందిన జుహూ బంగ్లాలోని అక్రమ నిర్మాణాలపై బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎమ్సీ) చర్యలు తీసుకుంది.
ఇంటర్నెట్ డెస్క్: బాలివుడ్ స్టార్ అజయ్ దేవ్‌గణ్‌కు చెందిన జుహూ బంగ్లాలోని అక్రమ నిర్మాణాలపై బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎమ్సీ) చర్యలు తీసుకుంది. ఆయన ఇంటిలో పలు నిర్మాణాలను ఈరోజు (శనివారం) కూల్చివేసింది. అజయ్ దేవ్‌గణ్ ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మాణ మార్పులను చేపట్టినట్లు బీఎమ్సీ పేర్కొంది. ఇంటీరియర్ మార్పులు, పార్టిషన్ గోడల నిర్మాణం, కిటికీల మోడిఫికేషన్ పనులు అనుమతులు లేకుండా చేస్తున్నట్టు తాము గుర్తించామని, అందుకే ఆయా నిర్మాణాలను ధ్వంసం చేశామని వెల్లడించింది. కాగా సెప్టెంబర్ 10న ఈ నిర్మాణాలపై అజయ్ దేవ్‌గణ్‌కు బీఎమ్సీ నోటీసు పంపించింది.
మరోవైపు అజయ్ దేవగణ్ ఇంకో వివాదంలో చిక్కుకున్నారు. ఆయన విమల్ ఇలాచీ ప్రకటనలో నటించడంపై మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) అభ్యంతరం వ్యక్తం చేసింది. నిషేధిత గుట్కా, పాన్ మసాలను ప్రమోట్ చేస్తున్నారని అజయ్‌పై మండిపడింది. ఈ క్రమంలో ఆయనకు షో కాజ్ నోటీసులు జారీ చేసింది.
కూల్చివేతకు సంబంధించిన చిత్రాలు..


ఈ వార్తలూ చదవండి
రైతులకు మహారాష్ట్ర ఐఏఎస్, ఐపీఎస్‌ల అండ.. సహాయనిధికి ఒక్కరోజు జీతం.
‘ఫుట్‌పాత్ ఏర్పాటు చేయకపోతే ధర్నాకు దిగుతాం’.. సుప్రీంకోర్టు హెచ్చరిక