Share News

రాత్రి నూడుల్స్ తిన్నారు.. తెల్లారేసరికి విగతజీవులుగా మారారు..!

ABN , Publish Date - Oct 17 , 2026 | 01:53 PM

ఉత్తర్‌ప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో ఈరోజు (శనివారం) ముగ్గురు పిల్లలతో పాటు వారి తల్లిదండ్రులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఒకే కుటుంబంలోని ఐదుగురు సభ్యులూ మరణించటంతో ఆ ప్రాంతంలో తీవ్ర విషాదం నెలకొంది.

రాత్రి నూడుల్స్ తిన్నారు.. తెల్లారేసరికి విగతజీవులుగా మారారు..!

ఇంటర్నెట్ డెస్క్: ఉత్తర్‌ప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో ఈరోజు (శనివారం) ముగ్గురు పిల్లలతో పాటు వారి తల్లిదండ్రులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఒకే కుటుంబంలోని ఐదుగురు సభ్యులూ మరణించటంతో ఆ ప్రాంతంలో తీవ్ర విషాదం నెలకొంది. వీరు ముందు రోజు రాత్రి నూడుల్స్ తిని నిద్రపోయారని, తెల్లారేసరికి ఇలా విగతజీవులుగా మారారని స్థానికులు తెలిపారు. దీంతో ఫుడ్ పాయిజన్ కారణంగా ఈ ఐదుగురు మృతి చెంది ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతులను మహేశ్ (37), ఆయన భార్య లలిత(35), పిల్లలు లడ్డు(11), మిష్టి(7), సాక్షాత్(3)గా గుర్తించారు.


కాగా ఇంకా వీరి మరణాలకు గల కారణాలు తెలియలేదు. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాలను పోలీసులు ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మరోవైపు ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ కుటుంబం తిన్న ఆహార పదార్థాలను పరీక్షిస్తున్నారు.


ఈ వార్తలూ చదవండి

రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం.. మినీ బస్సు ప్రమాదంలో 8 మంది మృతి..

ప్రపంచ ఆకలి సూచీలో భారత్‌కు 100వ స్థానం

Updated Date - Oct 17 , 2026 | 01:58 PM