Share News

జనసేన తొలి జాబితా.. విజయవాడ మేయర్ అభ్యర్థిగా వంగవీటి రాధ

ABN , Publish Date - Oct 17 , 2026 | 12:18 PM

స్థానిక ఎన్నికల కోసం జనసేన పార్టీ తొలి అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీ ఎన్నికల్లో జనసేన నుంచి పోటీ చేయనున్న అభ్యర్థుల తొలి జాబితాకు పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ ఆమోదం తెలిపారు.

జనసేన తొలి జాబితా.. విజయవాడ మేయర్ అభ్యర్థిగా వంగవీటి రాధ
Jana Sena Party

అమరావతి, అక్టోబర్ 17: స్థానిక ఎన్నికల కోసం జనసేన పార్టీ.. తొలి అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీ ఎన్నికల్లో జనసేన నుంచి పోటీ చేయనున్న అభ్యర్థుల తొలి జాబితాకు పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ ఆమోదం తెలిపారు. ఈ మేరకు పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల వివరాలను వెల్లడించారు. తొలి జాబితాలో రెండు కార్పొరేషన్లకు, 12 మున్సిపాలిటీలకు అభ్యర్థుల పేర్లను పార్టీ ప్రకటించింది.


అభ్యర్థులు వీరే..

కార్పొరేషన్లు:

  • విజయవాడ మేయర్ అభ్యర్థిగా వంగవీటి రాధాకృష్ణ

  • ఏలూరు మేయర్ అభ్యర్థిగా రెడ్డప్ప నాయుడు

మున్సిపాలిటీలు:

  • అమలాపురం మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా నల్లా శ్రీధర్

  • చిలకలూరిపేట - తోట రాజరాజేశ్వరి

  • గొల్లప్రోలు - కడారి తమ్మయ్య నాయుడు

  • నరసాపురం - కొత్తపల్లి శైలజ

  • నిడదవోలు - కల్లం జ్యోతి

  • పెడన - మట్టా శివపావని

  • పిఠాపురం - డాక్టర్ బీరా విజయ్‌శేఖర్

  • పుత్తూరు - డి.ఏలుమలై

  • సాలూరు - గొర్లె విజయకుమారి

  • సామర్లకోట - పిట్టా జానకి రామారావు

  • తెనాలి - తోటకూర వెంకట రమణారావు

  • తిరువూరు - పి. మాధవి


ఇవి కూడా చదవండి..

పుంగనూరులో వైసీపీ దాడులపై బోండా ఉమ ఫైర్.. మిథున్ రెడ్డి అరెస్ట్‌కు డిమాండ్

పుంగనూరు ఘటన.. నామినేషన్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 17 , 2026 | 12:48 PM