Share News

రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం.. మినీ బస్సు ప్రమాదంలో 8 మంది మృతి..

ABN , Publish Date - Oct 17 , 2026 | 10:41 AM

రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కోటా జిల్లాలోని ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వేపై ప్రయాణికులతో వెళ్తున్న మినీ బస్సు అదుపుతప్పి లోతైన కాలువలో పడిపోయింది.

రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం.. మినీ బస్సు ప్రమాదంలో 8 మంది మృతి..
Kota bus accident

ఇంటర్నెట్ డెస్క్: రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కోటా జిల్లాలోని ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వేపై ప్రయాణికులతో వెళ్తున్న మినీ బస్సు అదుపుతప్పి లోతైన కాలువలో పడిపోయింది. ఈ ప్రమాదంలో కనీసం ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోగా, 17 మంది గాయపడ్డారు. శనివారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ కుటుంబ సభ్యులు ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురైంది (Kota bus accident).


ప్రమాదానికి గురైన మినీ బస్సులో మధ్యప్రదేశ్‌కు చెందిన కుటుంబ సభ్యులు ఉన్నారు. వీరు రాజస్థాన్‌లోని ఖాటూ శ్యామ్ ఆలయానికి వెళ్తున్నారు. ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వేపై వెళ్తున్న సమయంలో మినీ బస్సు అదుపుతప్పి సుమారు 15 అడుగుల లోతున్న కాలువలో పడిపోయింది. వాహనంలో సుమారు 25 మంది ఉన్నట్లు సమాచారం. పోలీసులు, సహాయక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు (Rajasthan road accident).


బస్సులో చిక్కుకున్న వారిని బయటకు తీసి ఆసుపత్రులకు తరలించారు (8 killed in bus accident). గాయపడిన వారిని కోటాలోని న్యూ మెడికల్ కాలేజీ హాస్పిటల్, ఎంబీఎస్ హాస్పిటల్‌కు తరలించారు. బస్సు అదుపుతప్పడానికి గల కారణాలు ఇంకా పూర్తిగా నిర్ధారణ కాలేదు. డ్రైవర్ నిద్రమత్తులోకి వెళ్లడం లేదా వాహనం వేగంగా ప్రయాణించడం ప్రమాదానికి కారణమై ఉండవచ్చని భావిస్తున్నారు.


ఇవి కూడా చదవండి..

బంగారం ధరలు మళ్లీ కిందకే.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..


ఐదు రోజులకే పదవి పోయింది.. ట్రంప్ సంచలన నిర్ణయం!

Updated Date - Oct 17 , 2026 | 11:59 AM