ప్రపంచ ఆకలి సూచీలో భారత్కు 100వ స్థానం
ABN , Publish Date - Oct 17 , 2026 | 06:23 AM
ప్రపంచ ఆకలి సూచీ-2026 ర్యాంకులు వెలువడ్డాయి. మొత్తం 122 దేశాల్లోని పరిస్థితులను సమీక్షించగా 24.1 స్కోరుతో భారత్ 100వ స్థానం, 25.5 స్కోరుతో పాకిస్థాన్ 106వ ర్యాంకు పొందాయి.
న్యూఢిల్లీ, అక్టోబరు 16: ప్రపంచ ఆకలి సూచీ-2026 ర్యాంకులు వెలువడ్డాయి. మొత్తం 122 దేశాల్లోని పరిస్థితులను సమీక్షించగా 24.1 స్కోరుతో భారత్ 100వ స్థానం, 25.5 స్కోరుతో పాకిస్థాన్ 106వ ర్యాంకు పొందాయి. రెండు దేశాలూ ‘తీవ్రమైన ఆకలి’ కేటగిరీలో ఉన్నాయి. దక్షిణాసియా ప్రాంతీయ స్కోరు 23.5గా నమోదింది. స్కోరు ఎంత తక్కువగా ఉంటే ఆకలి అంత తక్కువగా ఉన్నట్టు లెక్క. పిల్లల్లో పౌష్టికాహార లోపం, దీర్ఘకాలం పాటు పోషకాహారం అందుబాటులో లేకపోవడం, బరువు తక్కువగా ఉండడం, శిశు మరణాలను పరిగణనలోకి తీసుకొని ఆకలి సూచీలను లెక్కించారు.