పిల్లలకూ ఇంటర్నెట్ వాడుకునే హక్కుంది.. సుప్రీంకోర్టు కీలక తీర్పు..
ABN , Publish Date - Oct 17 , 2026 | 01:48 PM
ఇంటర్నెట్ను ఉపయోగించుకోవడం ప్రతి వ్యక్తి ప్రాథమిక హక్కు అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పిల్లలకు కూడా వారి వయసుతో సంబంధం లేకుండా ఈ హక్కు ఉంటుందని వెల్లడించింది.
ఇంటర్నెట్ డెస్క్: ఇంటర్నెట్ను ఉపయోగించుకోవడం ప్రతి వ్యక్తి ప్రాథమిక హక్కు అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పిల్లలకు కూడా వారి వయసుతో సంబంధం లేకుండా ఈ హక్కు ఉంటుందని వెల్లడించింది. పిల్లల ఆన్లైన్ భద్రత పేరుతో వారికి పూర్తిగా ఇంటర్నెట్ను దూరం చేయడం సరైన పరిష్కారం కాదని అభిప్రాయపడింది. జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ కే వినోద్ చంద్రన్లతో కూడిన ధర్మాసనం ఈ కీలక వ్యాఖ్యలు చేసింది (Supreme Court internet ruling).
భారత రాజ్యాంగంలోని 19(1)(ఎ) అధికరణంలోని భావప్రకటన స్వేచ్ఛకు ఇంటర్నెట్ వినియోగంతో సంబంధం ఉందని సుప్రీంకోర్టు పేర్కొంది. ఇంటర్నెట్ ద్వారా సమాచారాన్ని తెలుసుకోవడం, అభిప్రాయాలను వ్యక్తం చేయడం, ఇతరులతో ఆలోచనలను పంచుకోవడం సాధ్యమవుతుందని వివరించింది. ముఖ్యంగా మారుమూల ప్రాంతాల్లో నివసించే అనేక మంది పిల్లలకు విద్య, సమాచారం పొందేందుకు ఇంటర్నెట్ ఒక్కటే ప్రధాన మార్గమని గుర్తు చేసింది (children's internet rights).
ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలు తమలాంటి వారితో పరిచయాలు పెంచుకోవడానికి, సామాజికంగా అనుసంధానమయ్యేందుకు కూడా ఇంటర్నెట్ ఉపయోగపడుతుందని తెలిపింది (Online child safety). పిల్లల ఆన్లైన్ భద్రతపై ఆందోళనలు ఉన్నప్పటికీ, వారందరికీ ఇంటర్నెట్ను పూర్తిగా నిషేధించడం సరైన మార్గం కాదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. హానికరమైన సమాచారాన్ని గుర్తించి తొలగించడంలో సామాజిక మాధ్యమ సంస్థలు విఫలమైతే, దానికి పిల్లలను బాధ్యులుగా చూడటం సరికాదని పేర్కొంది. పిల్లల భద్రత కోసం తగిన నియంత్రణలు అవసరమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సోషల్ మీడియా ఖాతాలకు ప్రత్యేక 'చైల్డ్ మోడ్'ను ప్రవేశపెట్టే అవకాశాన్ని ప్రస్తావించింది.
ఇవి కూడా చదవండి..
బంగారం ధరలు మళ్లీ కిందకే.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..
ఐదు రోజులకే పదవి పోయింది.. ట్రంప్ సంచలన నిర్ణయం!