Share News

కాలుష్య కాటు.. కాలేయానికి చేటు

ABN , Publish Date - Jul 28 , 2026 | 10:17 AM

కాలేయాన్ని పీల్చి పిప్పి చేసే అత్యంత ప్రమాదకరమైన ఇన్ఫెక్షన్‌ ‘హెపటైటిస్‌’. ప్రారంభంలోనే దీనిని గుర్తించకపోతే ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుంది.

కాలుష్య కాటు.. కాలేయానికి చేటు
World Hepatitis Day

  • సైలెంట్‌ కిల్లర్‌ హెపటైటిస్‌

  • కలుషిత నీరు, ఆహారం, అపరిశుభ్రతతో పెరుగుతున్న బాధితులు

  • టీకా, ముందస్తు పరీక్షలతో వ్యాధులకు చెక్‌

  • నేడు వరల్డ్‌ హెపటైటిస్‌ డే

హైదరాబాద్‌ సిటీ: కాలేయాన్ని పీల్చి పిప్పి చేసే అత్యంత ప్రమాదకరమైన ఇన్ఫెక్షన్‌ ‘హెపటైటిస్‌’. ప్రారంభంలోనే దీనిని గుర్తించకపోతే ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుంది. శరీరంలోకి ప్రవేశించినా ఎలాంటి లక్షణాలు చూపించకుండా లోలోపలే కాలేయాన్ని దెబ్బతీస్తుంది కాబట్టి వైద్యులు దీనిని ‘సైలెంట్‌ కిల్లర్‌’ అని పిలుస్తారు. ప్రధానంగా హెపటైటిస్-బీ, హెపటైటిస్-సీ వైరస్‌ ఎక్కువ మందిపై దాడి చేస్తున్నాయి. మన దేశంలో హెపటైటిస్‌-బీతో 3.4 శాతం, హెపటైటిస్-సీతో ఒక శాతం మంది బాధపడుతుండగా.. ఒక శాతం మంది గర్భిణులు కూడా ఈ ఇన్ఫెక్షన్‌ బారినపడుతున్నారు.


ప్రపంచ వ్యాప్తంగా కాలేయ సంబంధిత వ్యాధులు, లివర్‌ క్యాన్సర్‌ కారణంగా ప్రతి ఏటా దాదాపు 13 లక్షల మంది మరణిస్తున్నారు. 2030 నాటికి వైరల్‌ హెపటైటిస్‏ను ప్రజారోగ్య సమస్య జాబితా నుంచి నిర్మూలించడమే లక్ష్యంగా అంతర్జాతీయ చర్యలు కొనసాగుతున్నాయి. హెపటైటిస్-బీ వైర్‌సను కనుగొన్న బ్లంబర్గ్‌ జయంతిని పురస్కరించుకుని జూలై 28న ‘వరల్డ్‌ హెపటైటిస్‌ డే’ నిర్వహిస్తున్నారు.


city1.2.jpgబయటపడని ప్రారంభ లక్షణాలు

వ్యాధి వ్యాపించిన ప్రారంభంలో ఎలాంటి స్పష్టమైన లక్షణాలు ఉండవు. అలసట, ఆకలి మందగించడం, వికారం, కడుపులో అసౌకర్యం వంటి చిన్నచిన్న సమస్యలను చాలామంది సాదాసీదాగా భావించి నిర్లక్ష్యం చేస్తారు. కానీ కామెర్లు, కడుపు ఉబ్బరం, హఠాత్తుగా బరువు తగ్గడం వంటి లక్షణాలు బయటపడేసరికి వ్యాధి ముదిరిపోతుంది.


ఐదు రకాల ఇన్ఫెక్షన్లు

హెపటైటిస్-ఏ, బీ, సీ, డీ, ఈ అని ఐదు రకాల ఇన్ఫెక్షన్లు కాలేయాన్ని తీవ్రంగా దెబ్బతీస్తాయి.

  • హెపటైటిస్-ఏ, ఈ : ఇవి కలుషిత నీరు, అపరిశుభ్ర ఆహారం ద్వారా సోకుతాయి. కామెర్ల లక్షణాలు కనిపిస్తాయి.

  • హెపటైటిస్-బీ, డీ : బాధితుల రక్తం, శరీర ద్రవాల ద్వారా ఇతరులకు వ్యాపిస్తాయి. రక్తం చుక్కలు ఎండిపోయినా ఈ వైరస్‌ వారం రోజుల పాటు బతికే ఉంటుంది.

  • హెపటైటిస్-సీ : సరిగ్గా స్టెరిలైజ్‌ చేయని వైద్య పరికరాలు, ఒకరు వాడిన నీడిల్స్‌ వాడటం వల్ల సోకుతుంది.

  • హెపటైటిస్-బీ, సీలను నిర్లక్ష్యం చేేస్త ‘లివర్‌ సిర్రోసి్‌స’కు దారితీస్తుంది.


city1.3.jpgక్రమంగా కాలేయ పరీక్షలు చేయించాలి

ఎలాంటి లక్షణాలు కనిపించకపోయినా కాలేయంపై పడుతున్న ఒత్తిడిని ముందే పసిగట్టేందుకు ‘లివర్‌ స్ర్కీనింగ్‌’ చేయించుకోవాలి. లివర్‌ ఫంక్షన్‌ టెస్ట్‌ ద్వారా కాలేయంలోని ఎంజైమ్‌లు, ప్రొటీన్ల వివరాలను తెలుసుకోవచ్చు. ఊబకాయం, మధుమేహం, ఫ్యాటీ లివర్‌ ఉన్నవారు, సప్లిమెంట్లు వాడేవారు, కుటుంబంలో లివర్‌ వ్యాధుల చరిత్ర ఉన్నవారు క్రమం తప్పకుండా ఈ పరీక్షలు చేయించుకోవాలి.

  • డాక్టర్‌ జి.శ్రీనివాస్‏రెడ్డి, సీనియర్‌ క్లినికల్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ హెపటాలజిస్టు, స్టార్‌ ఆస్పత్రి


బిడ్డ పుట్టగానే వ్యాక్సిన్‌ వేయించాలి

హెపటైటిస్-బీ నుంచి రక్షణ పొందేందుకు టీకా ఒక సురక్షితమైన ఆయుధం. బిడ్డ పుట్టిన వెంటనే మొదటి టీకా వేయించి, ఆ తర్వాత షెడ్యూల్‌ ప్రకారం అన్ని డోసులు పూర్తి చేయాలి. గతంలో వ్యాక్సిన్‌ తీసుకోని పెద్దలు, డయాలసిస్‌ రోగులు కూడా టీకా వేయించుకోవాలి.

  • డాక్టర్‌ కె. బాల మురళీకృష్ణ, సీనియర్‌ హెపటాలజిస్ట్‌, కిమ్స్‌ ఆస్పత్రి


చిన్న పొరపాట్లే పెద్ద ముప్పు

వ్యాధి ముదిరి సిర్రోసిస్‌, కాలేయ వైఫల్యం లేదా క్యాన్సర్‌ బారిన పడ్డాకే చాలామంది ఆస్పత్రికి వస్తున్నారు. కాలేయ సమస్యలు కేవలం మద్యం లేదా ఫ్యాటీ లివర్‌ వల్లే వస్తాయని భావించడం పొరపాటు. మలవ్యర్థాలు కలిసిన తాగునీటి వల్ల హెపటైటి్‌స-ఏ వస్తుంది. ఒకరు వాడిన ఇంజెక్షన్లు, టూత్‌ బ్రష్‌, షేవింగ్‌ బ్లేడ్లు మరొకరు వాడొద్దు.

  • డాక్టర్‌ రఘురామ్‌ కొండాల, గ్యాస్ర్టో ఎంటరాలజిస్ట్‌, కేర్‌ ఆస్పత్రి


ఈ వార్తలు కూడా చదవండి:

భారీగా తగ్గిన పసిడి ధరలు.. ప్రస్తుతం మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..

‘ఆమె’కు అండగా జీఆర్‌సీలు!

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Jul 28 , 2026 | 10:23 AM