రోజుకు ఒకటి...
ABN , Publish Date - Jun 07 , 2026 | 01:46 PM
డజను అరటిపండ్లు కొంటే... ఒకట్రెండు రోజుల్లోనే బాగా మగ్గిపోతాయి. దాంతో నచ్చక చెత్తబుట్టలో వేస్తాం. అలాంటప్పుడు రోజూ ఒక అరటిపండు చొప్పున ఫ్రెష్‌గా వారం పాటు తినాలంటే ఎలా? ఈ సమస్యకు దక్షిణ కొరియా ఒక చక్కని ఐడియా కనిపెట్టింది.

సాధారణంగా ఒక గెల నుంచి తెంపిన పండ్లు ఒకేసారి పండుతాయి. వాటిని రోజుకొకటి చొప్పున తినాలంటే... అందుకోసం దక్షిణ కొరియాలోని ఇ-మార్ట్ సూపర్ మార్కెట్ చైన్ ఓ వినూత్నమైన ప్యాకేజింగ్‌ను ప్రారంభించింది. ఈ ప్యాకింగ్‌లో ఏడు అరటిపండ్లు ఉంటాయి. దక్షిణ కొరియాలో ‘రోజుకు ఒకటి’ అనే పద్ధతిలో అరటిపండు ప్యాక్‌లను అమ్ముతారు. అందులో ప్రతీ ఒక్క అరటిపండు వేర్వేరు పక్వ దశలలో
ఉంటుంది. అంటే పసుపు రంగు నుంచి క్రమంగా ఆకుపచ్చ రంగుదాకా. ఉదాహరణకు పసుపు రంగు అరటిపండు ఆ రోజే తినడానికి సిద్ధంగా ఉంటుంది. తర్వాతి పండు మరుసటిరోజు పండుతుంది. ఇలా... వారం పాటు ఎంచక్కా ఎలాంటి టెన్షన్ లేకుండా అరటిపండును ఆరగించొచ్చు. దీనిని సాధారణంగా జరిగే ఆహార వ్యర్థాల సమస్యకు ఒక సులభమైన పరిష్కారంగా పేర్కొంటున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
సినిమాలకు గుడ్‌బై చెప్పనున్న విజయ్ ఆంటోనీ.. 3 సంవత్సరాల తర్వాత..
Read Latest AP News And Telangana News And International News And Telugu News