Share News

భయంకరమైన జైలులోకి సరదాగా...

ABN , Publish Date - Jun 07 , 2026 | 09:54 AM

ఆ జైలులో అత్యంత కట్టుదిట్టమైన భద్రత.... దాని చుట్టూ సముద్రం... ఒకవేళ ఖైదీలు తప్పించుకుని సముద్రంలోకి దూకితే, క్షణాల్లో శరీరం గడ్డకట్టిపోయేంత చల్లటి నీళ్లు.

భయంకరమైన జైలులోకి సరదాగా...
Prison

ఆ జైలులో అత్యంత కట్టుదిట్టమైన భద్రత.... దాని చుట్టూ సముద్రం... ఒకవేళ ఖైదీలు తప్పించుకుని సముద్రంలోకి దూకితే, క్షణాల్లో శరీరం గడ్డకట్టిపోయేంత చల్లటి నీళ్లు. కరడుగట్టిన ఖైదీలను ఉంచిన జైలు ‘అల్కట్రాజ్‌’. అదంతా గతం... ఇప్పుడొక పర్యాటక ప్రదేశం. గులాబీ తోటలు, పక్షుల కిలకిల రావాలు... పర్యాటకులతో సందడిగా కనిపిస్తోంది. ఇటీవల డొనాల్డ్‌ ట్రంప్‌ ‘అల్కట్రాజ్‌ను తిరిగి జైలుగా మారుస్తాం’ అనడంతో అది కాస్తా వైరల్‌ అవుతోంది. ఆ భయంకరమైన జైలు ఎలా ఉంటుందంటే...

ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన జైలు ఏదంటే ‘అల్కట్రాజ్‌’ పేరు చెబుతా రెవరైనా. కరడుగట్టిన ఖైదీలను మాత్రమే అక్కడికి తరలించేవారు. ఆ జైలు పేరు చెబితే ఖైదీలు వణికిపోయేవారు. సదరు జైలులో నియమాలు అంతే కఠినంగా ఉండేవి. అల్కట్రాజ్‌ ప్రాంతం ఒక చిన్నదీవి. శాన్‌ఫ్రాన్సిస్కోకు సమీపంలో ఉంటుంది. నిజానికి ఆ దీవిలో ముందుగా ఒక కోటను నిర్మించారు. 18వ శతాబ్దంలో అంతర్యుద్ధంలో పాల్గొన్న సానుభూతిపరులను అక్కడ నిర్బంధించారు.


తరువాత 1930లో కరడుగట్టిన ఖైదీలను ఉంచేందుకు జైలుగా మార్చారు. ఈ జైలులో ఉన్న ఖైదీల పేర్లు చెబితే ప్రపంచం గడగడలాడిపోయేది. అల్కట్రాజ్‌ జైలు నుంచి తప్పించుకోవడం అసాధ్యం. అయితే జైలులోని మురుగునీటిని సముద్రంలోకి వదలడం, ఆహారం, తాగు నీరు పడవల ద్వారా సరఫరా చేయాల్సి రావడం వంటి కారణాల వల్ల జైలు నిర్వహణ భారం కావడంతో 1963లో మూసివేశారు. ఆ తరువాత ప్రభుత్వం అల్కట్రాజ్‌ను మ్యూజియంగా మార్చింది. అప్పటి నుంచి జైలును చూసేందుకు పర్యాటకులను అనుమతించింది. ‘ది రాక్‌’ అని పిలిచే అల్కట్రాజ్‌ను ఏటా కొన్ని లక్షలమంది సందర్శిస్తున్నారు.


book4.3.jpgగులాబీ తోటలు... అభయారణ్యం...

అల్కట్రాజ్‌ ద్వీపంలో చూడచక్కని గులాబీ తోటలు, పక్షుల అభయారణ్యం వంటివి ఉన్నాయి. హమ్మింగ్‌బర్డ్స్‌, ఇగ్రెట్స్‌, హెరాన్స్‌ వంటి పక్షులకు ఆ ప్రాంతం నిలయం. జైలుగా కొనసాగినప్పుడు అధికారులు, సిబ్బంది పూల తోటలను పెంచారు. ముఖ్యంగాగులాబీతోటలు ఆ దీవికి అందాన్ని తీసుకు వచ్చాయి. పర్యాట కులు తప్పక చూడాల్సిన ప్రదేశంగాచెబుతారు. సందర్శకులు శాన్‌ఫ్రాన్సిస్కో నుంచి పడవలో అల్కట్రాజ్‌కు చేరుకోవాల్సి ఉంటుంది. కరడు గట్టిన ఖైదీలను ఉంచిన గదులనుసందర్శకులు చూడొచ్చు. పర్యాటకులు జైలు గదులలో కూర్చుని ఫొటోలు దిగేందుకు ఆసక్తి చూపు తుంటారు. ప్రపంచంలోనే అత్యంత కఠిన మైన జైలుగా గుర్తింపు పొందిన అల్కట్రాజ్‌ సందర్శన ఒక గొప్ప అనుభూతిని అందిస్తుంది.


నిర్వహణకు మూడు రెట్లు ఖర్చు...

ఎన్నో చారిత్రక సంఘటనలకు కేంద్రంగా ఉన్న అల్కట్రాజ్‌ను మూసివేసే సమయానికి 300 మంది ఖైదీలుండేవారట. వారందరినీ ఇతర జైళ్లలోకి తరలించారు. ఈ జైలును తిరిగి తెరవడానికి ట్రంప్‌ ఇటీవల ఆసక్తి చూపారు. కానీ ఇతర జైళ్ల నిర్వహణతో పోలిస్తే అల్కట్రాజ్‌ నిర్వహణకు మూడు రెట్లు ఖర్చు ఎక్కువవుతోంది. అందుకే అధికారులు జైలును తిరిగి తెరవడానికి సుముఖంగా లేరు. పైగా అక్కడ సెక్యూరిటీ కెమెరాలు లేవు. భద్రతకు సంబంధించి ఎలాంటి అప్‌డేట్‌ జరగలేదు. ఇప్పటికే ఫెన్సింగ్‌ దెబ్బతింది. అందుకే ట్రంప్‌ నిర్ణయంపై మల్లగుల్లాలు పడుతున్నారు. ఏదేమైనా ఒకప్పుడు భయంకరమైన జైలుగా గుర్తింపు పొందిన అల్కట్రాజ్‌... అండమాన్‌ దీవుల్లోని ఒకప్పటి కాలపానీ జైలులాగే పర్యాటక ప్రదేశంగా మారడం విశేషం.


book4.4.jpgసినిమా వచ్చింది...

అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉన్న అల్కట్రాజ్‌ నుంచి ఒక స్పూన్‌తో జైలు నుంచి తప్పించుకోవచ్చా? అంటే అసాధ్యం అని అంటారెవరైనా. కానీ 1962లో ఒక ఖైదీ ఆ జైలు నుంచి తప్పించు కున్నాడు. ఆ సంఘటనల ఆధారంగా 1979లో క్లింట్‌ ఈస్ట్‌వుడ్‌ ప్రధానపాత్రలో ‘ఎస్కేప్‌ ఫ్రమ్‌ అల్కట్రాజ్‌’ పేరుతో సినిమా తీశారు. అయితే ఆ విధంగా ఎప్పుడూ కూడా జైలు నుంచి ఎవరూ తప్పించుకోలేదని అధికారులు అంటారు.


ఈ వార్తలు కూడా చదవండి:

తేడా రావొద్దు! పార్టీకి నష్టం చేస్తే కఠినంగా ఉంటా

సీఎం రేవంత్‌వి దేశద్రోహ వ్యాఖ్యలు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Jun 07 , 2026 | 10:27 AM