Share News

టాస్మాక్‌లో భారీగా అవకతవకలు.. సీఎం విజయ్ కీలక ఆదేశాలు..

ABN , Publish Date - Jun 07 , 2026 | 11:10 AM

తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ (టాస్మాక్‌)లో చోటుచేసుకున్న అవకతవకలపై తమిళనాడు ముఖ్యమంత్రి జోసఫ్ విజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టాస్మాక్ నిధుల లీకేజీ, అనధికారిక వసూళ్లు, పార్టీ ఫండ్ వ్యవహారాలపై కఠిన చర్యలకు ఆదేశించారు.

టాస్మాక్‌లో భారీగా అవకతవకలు.. సీఎం విజయ్ కీలక ఆదేశాలు..
Vijay CM crackdown

చెన్నై, జూన్ 7: తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ (టాస్మాక్‌)లో చోటుచేసుకున్న అవకతవకలపై తమిళనాడు ముఖ్యమంత్రి జోసఫ్ విజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టాస్మాక్ నిధుల లీకేజీ, అనధికారిక వసూళ్లు, పార్టీ ఫండ్ వ్యవహారాలపై కఠిన చర్యలకు ఆదేశించారు. తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి క్యాబినెట్ సమావేశం నిర్వహించారు. శుక్రవారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో టాస్మాక్‌పై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. మద్యం విక్రయాల ద్వారా వచ్చే ప్రతి రూపాయి కూడా రాష్ట్ర ఖజానాకే చేరేలా చూడాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.


అనధికారిక ‘పార్టీ ఫండ్’ వసూళ్ల ద్వారా ప్రతి నెలా దాదాపు 102 కోట్ల రూపాయలు టాస్మాక్ నుంచి దారి మళ్లుతున్నట్లు విజయ్ దృష్టికి వెళ్లింది. గత ఐదేళ్లలో రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి దాదాపు 1,600 కోట్ల రూపాయలు పక్కదారి పట్టి ఉండవచ్చని ప్రభుత్వ అధికారులు సీఎం విజయ్‌కి తెలిపారు. డీఎంకే ప్రభుత్వం టాస్మాక్‌ను రాజకీయ లబ్ధి కోసం వాడుకుందుని చెప్పారు. టాస్మాక్ హోల్‌సేల్, రిటైల్ నెట్‌వర్క్‌‌లో చాలా కాలం నుంచి నడుస్తున్న అనధికారిక నగదు వసూళ్ల వ్యవస్థలను తక్షణమే రద్దు చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.


డీఎంకే హయాంలో సోదాలు..

టాస్మా‌క్‌‌లో వెయ్యి కోట్ల కుంభకోణం జరిగిందన్న ఆరోపణల నేపథ్యంలో గత ఏడాది (2025) మార్చి 6, 8 తేదీల్లో టాస్మాక్ ప్రధాన కార్యాలయం సహా పలు ప్రాంతాల్లో ఈడీ దాడులు నిర్వహించింది. ఈ దాడులపై తమిళనాడు ప్రభుత్వం, టాస్మాక్.. మద్రాస్ హైకోర్టులో పిటిషన్‌లు దాఖలు చేశాయి. అదే ఏడాది ఏప్రిల్ 23వ తేదీన హైకోర్టు ఈ పిటిషన్లను కొట్టివేసింది. మనీలాండరింగ్ అనేది దేశ ప్రజలపై చేసే నేరంగా మద్రాస్ హైకోర్టు పేర్కొంది. దీంతో తమిళనాడు ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది.


ఇవి కూడా చదవండి

చికెన్ కబాబ్.. ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ రుచితో!

వైభవ్‌కు అండగా తల్లిదండ్రులు.. ఖర్చంతా బీసీసీఐదే..

Updated Date - Jun 07 , 2026 | 11:17 AM