Share News

థేచా పులావ్‌.. ఇలా చేస్తే ఆ టేస్టే వేరు..

ABN , Publish Date - Jun 07 , 2026 | 12:43 PM

థేచా పులావ్‌.. తయారీకి కావాల్సినవి... వరి అన్నం - రెండు కప్పులు, పచ్చి మిర్చి థేఛా - రెండు స్పూన్లు, ఉల్లి, ఆలూ ముక్కలు - నాలుగు స్పూన్లు.

థేచా పులావ్‌.. ఇలా చేస్తే ఆ టేస్టే వేరు..
Vantalu

కావలసిన పదార్థాలు: వరి అన్నం - రెండు కప్పులు, పచ్చి మిర్చి థేఛా - రెండు స్పూన్లు, ఉల్లి, ఆలూ ముక్కలు - నాలుగు స్పూన్లు. టమాటా ముక్కలు - మూడు స్పూన్లు, వెల్లులి ్ల- పది రెబ్బలు, పచ్చి మిర్చి - ఎనిమిది, జీలకర్ర - స్పూను, పనీర్‌ ముక్కలు - అర కప్పు, పల్లీలు- నాలుగు స్పూన్లు, ఆవాలు - స్పూను, కరివేపాకు - ఓ రెబ్బ, కొత్తిమీర తరుగు - రెండు స్పూన్లు, ఉప్పు, నెయ్యి - తగినంత


book8.jpgతయారుచేసే విధానం: ముందుగా పచ్చి మిర్చి థేచా ఎలా చేయాలో తెలుసుకుందాం. ఓ బాణలిలో రెండు స్పూన్ల పల్లీలు వేయించి, పక్కన పెట్టుకోవాలి. అదే బాణలిలో ఓ స్పూను నూనె వేసి పచ్చి మిర్చి, వెల్లుల్లి రెబ్బలు వేయించాలి. ఇందులో జీలకర్ర కూడా వేసి చిటపటలాడాక దించేయాలి. కాస్త చల్లారాక మిక్సీలో పేస్టు చేసుకోవాలి. ఇదే పచ్చి మిర్చి థేచా. ఇక పులావ్‌ విషయానికి వస్తే, ఓ పాన్‌లో నూనె వేసి ఆవాలు, కరివేపాకు, పల్లీలను వేయించాలి. ఇంకా ఉల్లి, టమాటా, ఆలూ ముక్కలు, ఉప్పు వేసి కాసేపు మగ్గించాలి. పనీర్‌ ముక్కలూ చేర్చాలి. ఓ నిమిషం తరవాత పచ్చి మిర్చి థేఛా వేసి కలపాలి. అంతా దగ్గరకి అవుతుంటే అన్నం జతచేయాలి. తక్కువ మంట మీద కాసేపు ఉడికించి స్టవ్‌ కట్టేస్తే సరి. పైన కొత్తిమీర తరుగు వేసి తింటే అద్భుతం.


ఈ వార్తలు కూడా చదవండి:

భయంకరమైన జైలులోకి సరదాగా...

సినిమాలకు గుడ్‌బై చెప్పనున్న విజయ్ ఆంటోనీ.. 3 సంవత్సరాల తర్వాత..

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Jun 07 , 2026 | 12:52 PM