Share News

కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిద్రలేపే ప్రయత్నం చేస్తున్నాం: హరీశ్‌రావు

ABN , Publish Date - Jun 07 , 2026 | 11:39 AM

బీఆర్ఎస్ పార్టీ పోరాడితేనే గోదావరి-బనకచర్ల ప్రాజెక్ట్ ఆగిందని ఆ పార్టీ నేత హరీశ్‌రావు అన్నారు. తాము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిద్రలేపే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. గోదావరిని పూర్తిగా మళ్లించి రాష్ట్రాన్ని మోసం చేస్తున్నారని మండిపడ్డారు.

కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిద్రలేపే ప్రయత్నం చేస్తున్నాం: హరీశ్‌రావు
Godavari water dispute

హైదరాబాద్, జూన్ 7: బీఆర్ఎస్ పార్టీ పోరాడితేనే గోదావరి-బనకచర్ల ప్రాజెక్ట్ ఆగిందని ఆ పార్టీ నేత హరీశ్‌రావు అన్నారు. తాము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిద్రలేపే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. గోదావరిని పూర్తిగా మళ్లించి రాష్ట్రాన్ని మోసం చేస్తున్నారని మండిపడ్డారు. హరీశ్‌రావు మీడియాతో మాట్లాడుతూ.. ‘రేవంత్ దగ్గర సమాధానం లేనప్పుడు తిట్టు అందుకుంటున్నారు. మమ్మల్ని తిట్టినా ప్రశ్నించడం ఆపం. మాకు తెలంగాణ ప్రయోజనాలే ముఖ్యం. గతంలో కృష్ణా.. ఇప్పుడు గోదావరిలో ద్రోహం చేస్తున్నారు. గోదావరిలో అసలు సర్‌ప్లస్ వాటర్ లేనేలేదు’..


‘ఏపీ సీఎం కావేరీ-గోదావరి లింక్ అంటున్నారు. పోలవరం నుంచి గోదావరి నీళ్లు మళ్లించాలని చూస్తున్నారు. నదుల అనుసంధానికి మేం కొన్ని ప్రతిపాదనలు పెట్టాం. ఇచ్చంపల్లి లేదా సమ్మక్కసాగర్ నుంచి నీళ్లు తీసుకోవాలని కోరాం. అప్పుడు మనం కూడా గోదావరి నీళ్లు వాడుకునే అవకాశం ఉంటుంది. కానీ పోలవరం నుంచి నీళ్లు మళ్లిస్తే మాకు అన్యాయం జరుగుతుంది. తెలంగాణ భూభాగం నుంచే నీళ్లు తీసుకోవాలని కర్ణాటక ఒప్పుకుంది. మా కేటాయింపులు వాడుకున్నాక నీళ్లు తీసుకోవాలని చెప్పాం. కావేరీకి తీసుకెళ్లే నీళ్లలో సగం మాకు ఇవ్వాలని కోరాం’ అని అన్నారు.


ఇవి కూడా చదవండి

టాస్మాక్‌లో భారీగా అవకతవకలు.. సీఎం విజయ్ కీలక ఆదేశాలు..

చికెన్ కబాబ్.. ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ రుచితో!

Updated Date - Jun 07 , 2026 | 11:41 AM