Share News

థర్మల్ డ్రోన్‌కు చిక్కిన పెద్దపులి.. పోలవరంలో హై అలర్ట్

ABN , Publish Date - Jun 07 , 2026 | 12:32 PM

పోలవరం జిల్లాలోని పాత నేలకోట సమీపంలో థర్మల్ డ్రోన్‌కు చిక్కిన పెద్దపులి కలకలం రేపుతోంది. పులి కదలికలను గుర్తించిన అటవీశాఖ అధికారులు వెంటనే 150 మంది సభ్యులతో ప్రత్యేక రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు.

థర్మల్ డ్రోన్‌కు చిక్కిన పెద్దపులి.. పోలవరంలో హై అలర్ట్
Polavaram Tiger News

పోలవరం జిల్లా: దేవీపట్నం మండలం పాత నేలకోట సమీపంలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. థర్మల్ డ్రోన్ కెమెరాకు చిక్కిన పులిని బంధించేందుకు అటవీశాఖ అధికారులు భారీ స్థాయిలో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. ప్రస్తుతం పూడిపల్లి-నేలకోట మధ్య ఉన్న కొండ ప్రాంతంలో పులి తిష్ట వేసినట్లు అధికారులు గుర్తించారు.


పెద్దపులిని సురక్షితంగా బంధించేందుకు సుమారు 150 మంది సభ్యులతో కూడిన హనుమాన్ రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగాయి. అటవీశాఖ, ప్రత్యేక నిపుణుల బృందాలు సమన్వయంతో పులి కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ చర్యలు చేపడుతున్నాయి.


పులి సమీప గ్రామాల్లోకి ప్రవేశించకుండా ఉండేందుకు డ్రోన్లు, హైపవర్ లైట్లు, శబ్ద పరికరాలను వినియోగిస్తూ నిరోధక చర్యలు చేపట్టారు. గ్రామస్తుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న అధికారులు, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ద్వారా నిరంతరం అవగాహన కల్పిస్తున్నారు. అప్రమత్తంగా ఉండాలని, అడవికి సమీప ప్రాంతాలకు వెళ్లవద్దని ప్రజలకు సూచిస్తున్నారు.

రాత్రి వేళల్లో కూడా థర్మల్ డ్రోన్ల సాయంతో పులి కదలికలను పర్యవేక్షిస్తున్న రెస్క్యూ బృందాలు, వీలైనంత త్వరగా పులిని బంధించి సురక్షిత ప్రాంతానికి తరలించేందుకు ప్రయత్నిస్తున్నాయి. పరిస్థితిని అటవీశాఖ అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు.


Also Read:

యోగాంధ్రతో ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌ : హోంమంత్రి అనిత

పుష్కర ఘాట్‌కు దేవాన్ష్‌ పేరు తొలగింపు

Updated Date - Jun 07 , 2026 | 12:32 PM