ప్రతి రోజూ యాలకులు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..
ABN , Publish Date - Jan 24 , 2026 | 01:25 PM
యాలకులు కేవలం సువాసన ఇచ్చే మసాలా దినుసు మాత్రమే కాదు, వీటిలో అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయి. ప్రతిరోజూ యాలకులు తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.
ఇంటర్నెట్ డెస్క్: భారతీయ వంటకాల్లో యాలకులు ఒక భాగంగా మారిపోయాయి. ప్రత్యేకమైన సుగంధాన్ని ఇచ్చే యాలకుల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దీన్ని రకరకాల ఆహారాల్లో, టీలో ఉపయోగిస్తారు. యాలకులను ‘సుగంధ ద్రవ్యాల రాణి’గా పిలుస్తారు. ఇందులో ఆల్ఫా టెర్పినోల్ 45 శాతం, మైర్సిన 27 శాతం, లిమోనెస్ 8 శాతం, మెంథోన్ 6 శాతం ఉంటుంది. అంతే కాదు, జింక్, విటమిన్ సి, ఐరన్, రిబోఫ్లావిన్, సల్ఫర్, నియాసిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడతాయి. అందుకే చాలామంది తమ పర్సు, ట్రావెల్ బ్యాగ్‌లో కొన్ని యాలకులను వేసుకొని ప్రయాణం చేస్తుంటారు.
1. జీర్ణక్రియ మెరుగుపడుతుంది:
చాలా మంది భోజనం చేసిన తర్వాత రెండు యాలకులను నోట్లో వేసుకొని నములుతుంటారు. ఈ అలవాటు చాలా మంచిది. ఇందులో ఉండే విటమిన్స్.. ఆహారం జీర్ణం కావడానికి సహాయపడతాయి. గ్యాస్, కడుపు ఉబ్బరం, అసిడిటీ వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. ఆహారం త్వరగా జీర్ణమయ్యేలా చేస్తాయి.
2. నోటి దుర్వాసన దూరం:
యాలకులు నోటి దుర్వాసనను పోగొట్టడంలో నంబర్ వన్. వీటిలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు నోటిలోని బ్యాక్టీరియాను చంపి, చిగుళ్ల వ్యాధుల నుంచి రక్షిస్తాయి. మలబద్ధకం, కడుపు నొప్పి ఉన్నవాళ్లు యాలకులు తింటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
3. గుండె ఆరోగ్యానికి మేలు:
యాలకులు రక్తపోటును అదుపులో ఉంచుతాయి. హై బీపీ ఉన్నవాళ్లకు యాలకులు దివ్య ఔషధంలా పనిచేస్తాయి. వీటిలో ఉండే యాంటీ యాక్సిడెంట్లు రక్త ప్రసరణను మెరుగుపరిచి గుండె సంబంధిత సమస్యలను తగ్గిస్తాయి. అలాగే వీటిలో ఉండే సిస్టోలిక్, డయాస్టొలిక్.. బీపీని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడతాయి.
4. శ్వాసకోశ సమస్యలు దూరం:
జలుబు, దగ్గు, ఆస్తమా ఉన్నవారు యాలకులు తీసుకోవడం వల్ల ఎంతో ఉపశమనం లభిస్తుంది. ఇవి ఊపిరితిత్తులలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. గొంతు నొప్పి ఉంటే.. గోరు వెచ్చని నీళ్లలో కొన్ని యాలకుల గింజలు వేసి తాగితే వెంటనే తగ్గిపోతుంది.
5. కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి:
శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి యాలకులు సహాయపడతాయి. ఇందులో ఉండే ఎంజైమ్‌లు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్లను తగ్గించడంలో సహాయపడతాయి. వీటిలో ఉండే ఫైటోకెమికల్స్ రక్తంలోని కొవ్వు నిల్వలు పేరుకుపోకుండా అడ్డుకుంటాయి.
Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ఇది కేవలం ప్రజల సాధారణ ఆరోగ్య ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.
Also Read:
తిన్న వెంటనే నీళ్లు తాగితే ఏమవుతుంది?
జామపండును తొక్కతో తినాలా? లేక తీసేసి తినాలా?
For More Latest News