Share News

షుగర్ పేషెంట్స్ పాన్ తింటే ఏమవుతుందో తెలుసా?

ABN , Publish Date - Jan 22 , 2026 | 02:57 PM

తమలపాకులు(పాన్) ఆరోగ్యానికి మేలు చేస్తాయని చాలా మంది నమ్ముతారు. అయితే.. మధుమేహం ఉన్నవారు పాన్ తినవచ్చా? మార్కెట్‌లో దొరికే పాన్ ఎంతవరకు సురక్షితం.? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

షుగర్ పేషెంట్స్ పాన్ తింటే ఏమవుతుందో తెలుసా?
Betel Leaves for Diabetes

ఇంటర్నెట్ డెస్క్: తమలపాకులు(పాన్) శతాబ్దాలుగా భారతీయ సంస్కృతిలో భాగంగా ఉన్నాయి. పెళ్లిళ్లు, పండుగలు, శుభకార్యాల్లో పాన్ తప్పనిసరిగా ఉంటుంది. చిన్న ఆకు అయినప్పటికీ ఇందులో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఆయుర్వేదంలో ఈ ఆకులను ముఖ్యమైన ఔషధ మొక్కగా పరిగణిస్తారు. అయితే మధుమేహం ఉన్నవారు పాన్ తినవచ్చా? మార్కెట్‌లో దొరికే పాన్ ఎంతవరకు సురక్షితమో ఓసారి పరిశీలిస్తే...


షుగర్ పేషెంట్స్ పాన్ తినవచ్చా?

  • తమలపాకుల్లో రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించే గుణాలు ఉంటాయి. ముఖ్యంగా టైప్-2 షుగర్ ఉన్నవారు ఉదయం ఖాళీ కడుపుతో కొద్దిగా తమలపాకు నమిలితే ప్రయోజనం ఉంటుంది. ఇవి ఇన్సులిన్ పనిచేసే విధానాన్ని మెరుగుపరుస్తాయి.

  • మార్కెట్‌లో దొరికే వాణిజ్య పాన్‌లో తమలపాకుతో పాటు సున్నం, తీపి పదార్థాలు, చెర్రీలు వంటివి ఉంటాయి. ఇవన్నీ రక్తంలో చక్కెరను వేగంగా పెంచుతాయి. ముఖ్యంగా పొగాకు కలిపిన పాన్.. షుగర్ నియంత్రణను మరింత కష్టంగా చేస్తుంది. అందువల్ల షుగర్ ఉన్నవారు పాన్ తినాలనుకుంటే పొగాకు, తీపి పదార్థాలు లేకుండా తినాలి.

  • ఎక్కువసేపు పాన్ నమలితే నోటి సమస్యలు, పళ్లు పాడవడం, చిగుళ్ల వాపు వంటి సమస్యలు రావచ్చు. అందుకే 10 నిమిషాల కంటే ఎక్కువసేపు పాన్ నమలకూడదని నిపుణులు సూచిస్తున్నారు.


తమలపాకుల ఇతర ఆరోగ్య ప్రయోజనాలు

  • జుట్టు పెరుగుదలకి సహాయపడతాయి, జుట్టును మందంగా చేస్తాయి.

  • పంటి నొప్పి, చిగుళ్ల వాపు తగ్గుతాయి.

  • దగ్గు, ఆస్తమా వంటి సమస్యలకు ఉపయోగపడుతుంది.

  • ఆకలి పెరుగుతుంది, జీర్ణక్రియ సక్రమంగా జరుగుతుంది.

  • మొటిమలు, మచ్చలు తగ్గించడంలో సహాయపడుతుంది.

  • మానసిక స్థితి మెరుగవుతుంది. ఒత్తిడి తగ్గి మనసు ప్రశాంతంగా ఉంటుంది.


Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ఇది కేవలం ప్రజల సాధారణ ఆరోగ్య ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించలేదు.

Also Read:

తిన్న వెంటనే నీళ్లు తాగితే ఏమవుతుంది?

జామపండును తొక్కతో తినాలా? లేక తీసేసి తినాలా?

For More Latest News

Updated Date - Jan 22 , 2026 | 03:36 PM