మొబైల్ నెక్ సిండ్రోమ్ అంటే ఏంటో తెలుసా?
ABN , Publish Date - Jan 21 , 2026 | 02:22 PM
ఆన్‌లైన్ క్లాసులు, గేమ్స్, సోషల్ మీడియా వల్ల గంటల తరబడి స్క్రీన్‌లను చూడటం సాధారణమైపోయింది. కానీ ఇలా సరైన భంగిమ లేకుండా మొబైల్‌ను ఉపయోగించడం వల్ల ‘మొబైల్ నెక్ సిండ్రోమ్’ అనే కొత్త ఆరోగ్య సమస్య పెరుగుతోందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ఈ రోజుల్లో పిల్లలు, యువత ఎక్కువ సమయం మొబైల్ ఫోన్లు, ట్యాబ్లు, ల్యాప్‌టాప్‌లతోనే గడుపుతున్నారు. ఆన్‌లైన్ క్లాసులు, గేమ్స్, సోషల్ మీడియా వల్ల గంటల తరబడి స్క్రీన్‌లను చూడటం సాధారణమైపోయింది. కానీ ఇలా సరైన భంగిమ లేకుండా మొబైల్‌ను ఉపయోగించడం వల్ల ‘మొబైల్ నెక్ సిండ్రోమ్’ అనే కొత్త ఆరోగ్య సమస్య తలెత్తుతోందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
కొన్నేళ్ల క్రితం వరకు ఆరుబయట నడుస్తూ ఒకరినొకరు చూసుకుని మాట్లాడుకునేవారు. కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా అందరూ తల వంచుకుని మొబైల్ స్క్రీన్‌లనే చూస్తున్నారు. ఈ అలవాటు మనకు తెలియకుండానే మెడ, వెన్నెముకపై తీవ్ర ఒత్తిడిని పెంచుతోంది.
మొబైల్ నెక్ సిండ్రోమ్ అంటే ఏమిటి?
సాధారణంగా మన తల బరువు సుమారు 4.5 నుంచి 5 కిలోలు ఉంటుంది. తల నిటారుగా ఉన్నప్పుడు ఈ బరువును మెడ సులభంగా తట్టుకుంటుంది. కానీ మొబైల్ చూడటానికి తలను ముందుకు వంచితే, మెడపై పడే ఒత్తిడి చాలా రెట్లు పెరుగుతుంది. కేవలం 15 డిగ్రీలు తలను వంచినా మెడపై ఒత్తిడి అధికమవుతుందని వైద్యులు చెబుతున్నారు.
మొబైల్ నెక్ సిండ్రోమ్ ఎందుకు వస్తుంది?
టెక్నాలజీ కారణంగా కాదు, మనం దాన్ని ఉపయోగించే తీరే ఈ సమస్యకు కారణమని నిపుణులు అంటున్నారు.
తప్పు భంగిమ: మొబైల్‌ను ఛాతీ లేదా కడుపు వద్ద పట్టుకుని చూడటం వల్ల మెడ వంగిపోతుంది.
యువతపై ప్రభావం: టీనేజర్లు ఆన్‌లైన్ క్లాసులు, గేమ్స్, సోషల్ మీడియా కోసం గంటల తరబడి స్క్రీన్‌లను చూస్తారు. ఇది వారి ఎముకలు, కండరాల పెరుగుదలపై ప్రభావం చూపుతుంది.
కదలికలు లేకపోవడం: ఎక్కువసేపు కూర్చోవడం, వ్యాయామం చేయకపోవడం వల్ల ఈ సమస్య మరింత పెరుగుతుంది.
ప్రారంభంలో ఇది సాధారణ మెడ నొప్పిలా అనిపించవచ్చు. కానీ దీర్ఘకాలంలో తీవ్రమైన సమస్యలకు దారితీస్తుంది.
మెడ, భుజాల్లో నొప్పి
తలనొప్పి, చేతుల్లో తిమ్మిరి
పై వీపు నొప్పి
వెన్నెముక డిస్క్‌లకు సమస్యలు
ఇప్పటివరకు వృద్ధులకు మాత్రమే వచ్చే మెడ సమస్యలు ఇప్పుడు 15–20 ఏళ్ల యువతలో కూడా కనిపిస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు.
ఈ లక్షణాలు ఉంటే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి..
మెడ నొప్పి 2–3 వారాలకుపైగా ఉండటం
చేతుల్లో తిమ్మిరి లేదా సూదులు గుచ్చినట్టు అనిపించడం
నడకలో లేదా సమతుల్యతలో ఇబ్బంది
ఎలా నివారించాలి?
ఫోన్ చూడడానికి తల వంచకుండా, కళ్ల ఎదురుగా పెట్టుకొని చూడండి.
ప్రతి 20 నిమిషాలకు విరామం తీసుకోవాలి (20-20-20 నియమం)
మెడ, వీపు వ్యాయామాలు చేయాలి
పడుకునే ముందు మొబైల్ వాడకాన్ని తగ్గించాలని నిపుణులు చెబుతున్నారు.
Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ఇది కేవలం ప్రజల సాధారణ ఆరోగ్య ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించలేదు.
Also Read:
తిన్న వెంటనే నీళ్లు తాగితే ఏమవుతుంది?
జామపండును తొక్కతో తినాలా? లేక తీసేసి తినాలా?
For More Latest News